https://oktelugu.com/

Prabhas vs Ram Charan : రామ్ చరణ్ సినిమాతో పోటీ పడనున్న ప్రభాస్ స్పిరిట్.. గెలిచేదెవరు..?

ఇక ఈ రెండు సినిమాల్లో ఏది పెద్ద సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మనం మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే...

Written By:
  • NARESH
  • , Updated On : May 17, 2024 / 08:14 PM IST

    Prabhas Spirit to compete with Ram Charan's film

    Follow us on

    Prabhas vs Ram Charan :  చిరుత సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక రెండో సినిమా అయిన మగధీరతో ఇండస్ట్రీ హిట్టు కొట్టి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను అందుకుంటూ మంచి గుర్తింపు నైతే సంపాదించుకుంటున్నాడు. ఇక ఎప్పుడైతే తను సుకుమార్ డైరెక్షన్ లో ‘రంగస్థలం’ సినిమా చేశాడో అప్పటినుంచి తనలో మంచి నటుడు కూడా ఉన్నాడు అనేది యావత్ సినిమా ప్రజలందరికీ తెలిసేలా చేశాడు.

    ఇక నిజానికి రామ్ చరణ్ పాన్ ఇండియా లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ తను చాలా మంచి పర్ఫామెన్స్ తో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక బుచ్చిబాబుతో మరొక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు కానీ తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కూడా భారీ ఎత్తున ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    అయితే బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ బుచ్చిబాబుల సినిమా అలాగే ప్రభాస్ స్పిరిట్ సినిమా రెండు కూడా పోటీపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో అటు రామ్ చరణ్, ఇటు ప్రభాస్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు కనక పోటీ పడితే వీటిలో గెలిచే సినిమా ఏది అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పలేం..

    ఎందుకంటే వీళ్ళు ఇద్దరు స్టార్ హీరోలే, అలాగే ఇద్దరు కూడా స్టార్ డైరెక్టర్లే కాబట్టి ఆయా సినిమాల కంటెంట్ ను బట్టి ప్రేక్షకులను ఏ సినిమా అయితే ఎక్కువగా ఇంప్రెస్ చేస్తుందో ఆ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఇక ఈ రెండు సినిమాల్లో ఏది పెద్ద సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మనం మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…