Siddu Jonnalagadda Remuneration : రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన టిల్లు స్క్వేర్ సిద్దు జొన్నలగడ్డ… అంత డిమాండ్ చేస్తున్నాడా!

ఇప్పుడు జొన్నలగడ్డతో సినిమా చేయాలంటే రూ. 15 కోట్లు సమర్పించు కోవాల్సిందే. ఆయన రెమ్యూనరేషన్ అంతగా పెరిగిందట.

Written By: NARESH, Updated On : May 17, 2024 7:44 pm

Siddu Jonnalagadda Remuneration

Follow us on

Siddu Jonnalagadda Remuneration : యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. ఒక్క సినిమా తో సిద్దు రేంజ్ మారిపోయింది. గతంలో సిద్దు పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. జోష్, ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో హీరోగా నటించాడు. ఆ చిత్రాలు కొంత ఫేమ్ తెచ్చిపెట్టాయి.

ఇక డీజే టిల్లు మూవీతో టాలీవుడ్ లో హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన టిల్లు స్క్వేర్ తో సిద్దు రేంజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా రూ. 125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ చేసింది. దీంతో అమాంతం రెమ్యునరేషన్ పెంచాశాడట స్టార్ బాయ్ సిద్దు. ఏకంగా తన పారితోషికం మూడు రెట్లు పెంచేశాడట.

టిల్లు స్క్వేర్ కి ముందు సినిమాకు 5 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ తో సినిమా అంటే అందుకు మూడు రెట్లు చెల్లించాల్సిందే అట. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో సిద్దు ‘ జాక్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ కంటే ముందే ఈ మూవీ కి సిద్దు సైన్ చేయడం జరిగింది. అందువల్ల దీనికి ఆయన అందుకున్న పారితోషికం రూ. 5 కోట్లు. ఈ గ్యాప్ లో టిల్లు స్క్వేర్ విడుదలై భారీ విజయం సాధించింది.

తదుపరి తాను చేసే చిత్రాలకు రెమ్యునరేషన్ గా రూ. 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట సిద్దు జొన్నలగడ్డ. నిజంగా ఇది ఊహించని పరిణామం. నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు రూ. 20 నుండి రూ. 25 కోట్ల మధ్య తీసుకుంటున్నారు. ఆ రేంజ్ కి రావడానికి టైం పట్టింది. రెండు సినిమాలతోనే సిద్దు నాని, విజయ్ దేవరకొండ సరసన చేరాడు. ఇప్పుడు జొన్నలగడ్డతో సినిమా చేయాలంటే రూ. 15 కోట్లు సమర్పించు కోవాల్సిందే. ఆయన రెమ్యూనరేషన్ అంతగా పెరిగిందట.