Prabhas Spirit Movie Teaser: నిన్న రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ని విడుదల చేశారు మేకర్స్. ఏ పోస్టర్ కూడా అభిమానులను నూటికి నూరు శాతం సంతృప్తి పరచలేకపోయింది. కానీ నిన్న రాత్రి సందీప్ వంగ విడుదల చేసిన ‘స్పిరిట్'(Spirit Movie) ఆడియో టీజర్ అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేసింది. సినిమాలో ఒక్క షాట్ కూడా కూడా చూపించకుండా, కేవలం టైటిల్స్ ని రోల్ చేస్తూ, వాయిస్ ఓవర్ తో ఈ రేంజ్ గూస్ బంప్స్ రప్పించొచ్చా..?, ఇలాంటి ప్రయోగం ఇప్పటి వరకు ఏ స్టార్ డైరెక్టర్ కూడా చేయలేదు,శభాష్ సందీప్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మెంటలెక్కిపోతున్నారు. ఇది కదా మాకు కావాల్సిన ఎమోషన్ అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. మా అభిమాన హీరో పుట్టినరోజు ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఈ ఆడియో టీజర్ విన్న తర్వాత అర్థం అయ్యింది ఏమిటంటే, ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, కానీ అతన్ని ఎదో ఒక సంఘటన కారణంగా అరెస్ట్ చేసి జైలులోకి తీసుకొస్తారు. ఆ జైలుకు జైలర్ గా ప్రకాష్ రాజ్ ఉంటాడు. రిమాండ్ లో ఉన్నప్పటికీ కూడా ఖైదీ ట్రీట్మెంట్ ఇస్తాడు. అప్పుడు ప్రభాస్ సందీప్ వంగ స్టైల్ లో నాకు చిన్నప్పటి నుండి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని అంటాడు. అక్కడితో ఈ ఆడియో టీజర్ ముగుస్తుంది. ఇంతకీ ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నమాట. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిప్తి దిమిరి నటిస్తుండగా, విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడట.
చిరంజీవి ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చేసాడని, ఆయన పేరు ఆడియో టీజర్ లో లేకపోయినా, ప్రత్యేకంగా ఒక వీడియో ద్వారా గ్రాండ్ గా త్వరలోనే ప్రకటిస్తారని, మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ని రప్పించే విధంగా ఆ వీడియో ఉంటుందని టాక్. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ ప్రకటన చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. సందీప్ వంగ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అనే విషయం మన అందరికీ తెలిసిందే. తన అభిమాన హీరో ని ఏ రేంజ్ లో చూపించాలని సందీప్ వంగ అనుకున్నాడో చూడాలి.
