Homeఎంటర్టైన్మెంట్Prabhas Spirit movie story: ప్రభాస్ 'స్పిరిట్' కథ ఇంత రొటీన్ గా ఉండబోతుందా.. ?...

Prabhas Spirit movie story: ప్రభాస్ ‘స్పిరిట్’ కథ ఇంత రొటీన్ గా ఉండబోతుందా.. ? ఇలా అయితే కష్టమే..

Prabhas Spirit movie story: సందీప్ వంగ(Sandeep Reddy Vanga) సినిమాకు నేషనల్ వైడ్ గా ఉండే యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బోల్డ్ ఆలోచనలతో ఆయన తెరకెక్కించే సన్నివేశాలు జెన్ జీ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేస్తుంది. అలాంటి డైరెక్టర్ కి జెన్ జీ ఆడియన్స్ లో అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ప్రభాస్ తోడైతే బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే […]

Prabhas Spirit movie story: సందీప్ వంగ(Sandeep Reddy Vanga) సినిమాకు నేషనల్ వైడ్ గా ఉండే యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బోల్డ్ ఆలోచనలతో ఆయన తెరకెక్కించే సన్నివేశాలు జెన్ జీ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేస్తుంది. అలాంటి డైరెక్టర్ కి జెన్ జీ ఆడియన్స్ లో అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ప్రభాస్ తోడైతే బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి. మార్చి 5, 2027 న ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ తాలూకు విస్ఫోటనాన్ని చూడబోతుంది. సందీప్ వంగ ప్రభాస్(Rebel Star Prabhas) ని వైల్డ్ గా వాడుకుంటే, స్పిరిట్ మూవీ(Spirit Movie) రికార్డ్స్ కూడా అంత వైల్డ్ గా ఉంటాయి. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ ని చూసి కొంతమంది చాలా రొటీన్ గా ఉందే, సందీప్ వంగ ఈసారి దెబ్బేసేలా ఉన్నాడు బాబోయ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

స్టోరీ లైన్ విషయానికి వస్తే సైకో కిల్లర్స్ గా పిలవబడే ఇద్దరు భార్య భర్తలు అమాయకుల ప్రాణాలను తీస్తూ, వాళ్ళు సంపాదించిన సంపద ని దోచుకుంటూ వెళ్తుంటారు. వీళ్ళ దుర్మాగలను అరికట్టే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ప్రభాస్ ఇందులో కనిపించబోతున్నాడు. మన చిన్న తనం నుండి ఈ స్టోరీ లైన్ మీద కొన్ని వందల సినిమాలు చూసుంటాము. మళ్లీ అదే స్టోరీ లైన్ తో తీస్తే ఆడియన్స్ అంగీకరిస్తారా అంటే కచ్చితంగా అంగీకరిస్తారు. ఎందుకంటే ఈమధ్య బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాలు సృష్టిస్తున్న ఏ సినిమా లో కూడా స్టోరీ వేరే లెవెల్ ఏమి ఉండదు. చాలా సింపుల్ గానే ఉంటుంది, కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే నడిపించే విధానం కొత్తగా ఉంటుంది. సందీప్ వంగ కూడా ఇదే జాతికి చెందిన డైరెక్టర్. ఆయన సినిమాల్లో స్టోరీ రొటీన్ గానే ఉంటుంది.

Also Read: పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన కుర్ర దర్శకులు…

‘యానిమల్’ చిత్రం లో స్టోరీ ఏముంది మీరే చెప్పండి?, తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ఇంతకు ముందు మనం ఏ సినిమాలో చూడలేదా ?, చూసాము కదా ?, అయినా ఎందుకు ఆ చిత్రం దాదాపుగా 800 కోట్ల గ్రాస్ రాబట్టిందంటే, ఆ సినిమా స్క్రీన్ ప్లే ని ఆయన నడిపించిన విధానం అలాంటిది మరి. ప్రతీ సన్నివేశం గూస్ బంప్స్ రప్పించేలా ఉంటుంది. అసలే వయొలెంట్ ఆలోచనలు ఉన్న సందీప్ వంగ ఈ చిత్రం లో విలన్స్ గా నాయిస్తున్న వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ లను ఎంత వయొలెంట్ గా చూపించి ఉంటాడో మీరే ఊహించుకోండి. ఇక వాళ్ళను మట్టికరిపించే పాత్రలో ప్రభాస్ ని ఎలా చూపిన్చచి ఉంటారో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ స్టోరీ రొటీన్ అనే భయం అసలు అక్కర్లేదు. ‘స్పిరిట్’ వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper