spot_img
Homeఎంటర్టైన్మెంట్Mani Sharma latest speech: కన్నీళ్లు రప్పిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ లేటెస్ట్ ప్రసంగం..ఎలా ఉండేవాడు..ఎలా...

Mani Sharma latest speech: కన్నీళ్లు రప్పిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ లేటెస్ట్ ప్రసంగం..ఎలా ఉండేవాడు..ఎలా అయిపోయాడు..

Mani Sharma latest speech: 90’s దశకం నుండి 2010 వ సంవత్సరం వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే మని శర్మ(Mani Sharma) మాత్రమే. ఆయన మ్యూజిక్ లో ఉండే స్వచ్ఛత నేటి తరం మ్యూజిషియన్స్ లో లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అంతం అనే చిత్రం తో మణిశర్మ సినీ ప్రస్థానం మొదలైంది. అందులో కేవలం ఆయన ఒక్క పాటకు మాత్రమే సంగీతం అందించాడు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ప్రేమించుకుందాం రా’ లో మూడు పాటలకు కంపోజ్ చేసాడు. ఆ మూడు పాటలు రెండు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపాయి. ఇక అక్కడి నుండి మణిశర్మ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

1998 వ సంవత్సరం ఆయన కెరీర్ ని మలుపు తిప్పింది. బావగారు బాగున్నారా, గణేష్, చూడాలని ఉంది , మనసిచ్చి చూడు, సమరసింహా రెడ్డి వంటి సూపర్ హిట్స్ ఈ సంవత్సరం లోనే విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ 5 సినిమాలకు మ్యూజిక్ ని అందించింది మని శర్మ నే . ఈ చిత్రం లోని పాటలను ఇప్పటికీ మరచిపోలేము. అలా కెరీర్ ప్రారంభం లోనే చార్ట్ బస్టర్స్ ని అందించి, సౌత్ లో దాదాపుగా అందరి హీరోలతో కలిసి పని చేసిన మని శర్మ కెరీర్ 2012 వ సంవత్సరం వరకు ఎలాంటి డోకా లేకుండా సాగిపోయింది. ఏడాదికి కనీసం పది సినిమాలు చేసేవాడు. కానీ కొత్త సంగీత దర్శకుల రాకతో మణిశర్మ కి అవకాశాలు రావడం ఆ తర్వాత మెల్లగా తగ్గుకుంటూ వచ్చాయి. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆయన కిరణ్ అబ్బవరం హీరో గ నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే సినిమాకు సంగీతం అందించాడు.

Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’ కథ ఇంత రొటీన్ గా ఉండబోతుందా.. ? ఇలా అయితే కష్టమే..

ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటని రీసెంట్ గానే ఒక గ్రాండ్ లంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ ఈవెంట్ కి విచ్చేసిన మణిశర్మ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి , ఆయన అభిమానులను కంటతడి పెట్టించేలా చేసింది. ఆయన మాట్లాడుతూ ‘ఒకరోజు ఈ చిత్ర నిర్మాత సాయి రాజేష్ మా ఇంటికి వచ్చాడు. నాతో ఏమి పని ఉంటుంది అని అనుకున్నాను. సార్ మా సినిమాకు సంగీతం అందించగలరా అని అడిగాడు. నేను నా హార్మొనీ ని మూలాన పెట్టి చాలా కాలమే అయ్యింది. ఆ అవసరం ఈమధ్య కాలం లో రాలేదు. నన్ను తీసుకొని రిస్క్ చేస్తున్నావేమో అని అన్నాను. కానీ ఆయన వినలేదు , ఆ హార్మొనీ దుమ్ము దులిపి మొదటి పాటని నా చేత కంపోజ్ చేయించాడు. ఆ పాట విన్న తర్వాత నమ్మకం వచ్చింది. మనలో ఇంకా విషయం ఉంది అని’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎలాంటి ఆల్బమ్స్ ఇచ్చిన లెజెండ్ ఆయన ?, అలాంటి వ్యక్తి నుండి ఇలాంటి మాటలు రావడం చూస్తుంటే ఏడుపొస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular