Homeఎంటర్టైన్మెంట్Prabhas Vishwambhara promotions: 'విశ్వంభర' మూవీ కి ప్రభాస్ స్పెషల్ ప్రొమోషన్స్.. త్వరలోనే సెన్సేషనల్ అప్డేట్...

Prabhas Vishwambhara promotions: ‘విశ్వంభర’ మూవీ కి ప్రభాస్ స్పెషల్ ప్రొమోషన్స్.. త్వరలోనే సెన్సేషనల్ అప్డేట్ రాబోతుంది..

Prabhas Vishwambhara promotions: యంగ్ హీరోల సినిమాలకు ప్రభాస్(Rebel Star Prabhas) తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేయడం కొత్తేమి కాదు. ఎన్నో ఏళ్ళ నుండి ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇక తన హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నుండి విడుదలయ్యే ప్రతీ మూవీ ప్రభాస్ ప్రమోషన్ ఉంటుంది. రీసెంట్ గా ఈ బ్యానర్ నుండి విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం కోసం ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు, అది ఆ చిత్రం లాంగ్ […]

Prabhas Vishwambhara promotions: యంగ్ హీరోల సినిమాలకు ప్రభాస్(Rebel Star Prabhas) తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేయడం కొత్తేమి కాదు. ఎన్నో ఏళ్ళ నుండి ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇక తన హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నుండి విడుదలయ్యే ప్రతీ మూవీ ప్రభాస్ ప్రమోషన్ ఉంటుంది. రీసెంట్ గా ఈ బ్యానర్ నుండి విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం కోసం ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు, అది ఆ చిత్రం లాంగ్ రన్ కి ఎంత ఉపయోగపడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఎల్లున్ది౮ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా ఈ బ్యానర్ నుండి ‘బైకర్’ అనే చిత్రం విడుదల కాబోతుంది. శర్వానంద్ హీరో గా నటించిన ఈ సినిమా ప్రొమోషన్స్ లో కూడా ప్రభాస్ పాల్గొన్నాడు. నిన్న మిర్చి మూవీ స్టైల్ లో ఆయన చేసిన ఒక స్పెషల్ వీడియో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం.

ఈ రెండు సినిమాల సంగతి పక్కన పెడితే, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie). మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా, వశిష్ఠ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఇంకా స్పష్టమైన సమాచారం లేదు కానీ, ఎప్పుడు విడుదలైన ఈ సినిమా ప్రొమోషన్స్ లో ప్రభాస్ కచ్చితంగా పాల్గొంటాడని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మెగాస్టార్ బ్రాండ్ సరిపోతుంది, ప్రభాస్ అవసరమా అని మెగా ఫ్యాన్స్ కి అనిపించొచ్చు. కానీ ఈ సినిమా ఎప్పుడో 2022 ఎండింగ్ లో మొదలైంది. షూటింగ్ 2024 లోనే పూర్తి అయిపోయింది. కానీ ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఇలా ఆలస్యమైనా సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఇప్పటికే గేమ్ చేంజర్ , హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితాలు ద్వారా చూసాము.

Also Read: పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన కుర్ర దర్శకులు…

ఆలస్యం అయినా పర్వాలేదు కానీ, ప్రమోషనల్ కంటెంట్ బాగుంటే క్రేజ్ బాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. టీజర్ అయితే పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది. చాలా మంది మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఒకటి ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇలాంటి జీరో బజ్ ఉంది కాబట్టే, మళ్లీ సినిమాపై క్రేజ్ ని తీసుకొచ్చే ప్రయత్నం లో ప్రభాస్ , మెగాస్టార్ కాంబినేషన్ లో ఒక ఇంటర్వ్యూ చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కచ్చితంగా ఈ ప్లాన్ భారీ రేంజ్ లో వర్క్ అవుతుంది, ప్రభాస్ , చిరంజీవి మ్యూచువల్ అభిమానులకు కూడా ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాని ఆగస్టు 21 న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper