Prabhas Spirit Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga)… ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలన్నీ తనకు గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఇండియాలోనే తనను స్టార్ డైరెక్టర్ గా మార్చేశాయి.
సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన అర్జున్ రెడ్డి (Arjun Reddy), అనిమల్ (Animal) లాంటి సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే ఆయన ప్రభాస్ తో స్పిరిట్ (Spirit) అనే సినిమాని చేయబోతున్నాడనే విషయం మనందరికి తెలిసిందే.
Also Read: ఇంత కాంట్రవర్సీ నడుమ కమల్ హాసన్ కి ఆస్కార్ గౌరవం.
ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక తనదైన రీతిలో ఆ పాత్రలో నటించి ఆ పాత్రకి ప్రాణం పోయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తనలోని నటుడిని బయటికి తీసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది… ఇక ప్రస్తుతం ఆయన ఫౌజీ (Fouji) సినిమాతో బిజీగా ఉన్నాడు. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు. ఆర్మీ ఆఫీసర్ గా మెస్మరైజ్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు పాన్ ఇండియాలో అతన్ని స్టార్ హీరోగా చేశాయి. ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు.
ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికి ప్రభాస్ వాటిని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికి వాటిని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేస్తాడు. అనే దాని మీదనే ఆయన కొంతవరకు డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి సందీప్ రెడ్డివంగా సినిమాలు అంటే ఎలా ఉంటాయనే విషయం మనందరికి తెలిసిందే.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
ఇక ఈ సినిమాలో హీరోని సైతం బాగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అనిమల్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రన్బీర్ కపూర్ ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఆయన ప్రభాస్ తమ్ముడు పాత్రలో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక స్టోరీ కీలకమైన మలుపు తిరిగే సమయంలో ఈ సినిమాలోకి తను ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రన్బీర్ కపూర్ కనక ఈ సినిమాలో నటించినట్లయితే ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ రన్బీర్ కపూర్ ఇద్దరు ఉంటే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…