Prabhas : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేసే సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి ప్రతి ప్రేక్షకుడిని తమ అభిమానిగా మార్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని సాశిస్తూ భారీ విజయాలను అందుకుంటూ కొంతమంది హీరోలు చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. నిజానికి వాళ్ల సినిమాలను సక్సెస్ చేయడంలో ఆయా చిత్రాల దర్శకులు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్(Prabhas)…ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. బాహుబలి (Bahubali సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారిపోయిన ఆయన ఆ తర్వాత నుంచి చేస్తున్న వరుస సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఆయన చేసిన ఈ సినిమాలన్నీ ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చి తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికి ప్రభాస్ లైనప్ చాలా పెద్దగా ఉంది. మూడు సంవత్సరాల వరకు ఆయనకు డేట్స్ ఖాళీగా లేవనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక దానికి తోడుగా ఇప్పుడు ఆయన ఒక డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా చేస్తే ఆ సినిమా పక్క ఇండస్ట్రీ హిట్ కొడుతుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు అయితే చేస్తున్నారు.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించిన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ప్రభాస్ (Prabhas) సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అంటూ కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు చేసిన కామెంట్లలో చాలావరకు నిజం ఉందంటూ మరికొంతమంది వాటిని సమర్థిస్తున్నారు.
లోకేష్ కనకరాజు అంటే ఈ జనరేషన్ లో ఉన్న స్టైలిష్ మేకర్లలో తను ఒకడు. కాబట్టి ఆయన మేకింగ్ స్టైల్ ప్రభాస్ కి చాలా వరకు ప్లస్ అవుతుంది. ప్రభాస్, లోకేష్ కాంబోలో కనక సినిమా వస్తే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాకుండా ఆయన రేంజ్ ను కూడా అమాంతం పెంచుతుంది.
కాబట్టి ఆయనతో సినిమా చేస్తే ప్రభాస్ కి సూపర్ సక్సెస్ దక్కుతుంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక వీళ్ళ కాంబోలో సినిమా ఎపుడు వస్తుంది. వీళ్ళు ఎలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేస్తారు. తద్వారా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : ప్రభాస్ తో సూపర్ మ్యాన్ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసిన సుకుమార్…