Prabhas Salaar : ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. బాహుబలి సిరీస్ తో ఆల్ ఇండియా షేక్ చేసిన ప్రభాస్, అనంతరం చేసిన రెండు చిత్రాలు ఆకట్టుకోలేదు. సాహో పర్లేదు అనిపించుకుంది. హిందీలో విజయం సాధించిన సాహో తెలుగుతో పాటు ఇతర భాషల్లో నిరాశపరిచింది. ఇక రాధే శ్యామ్ వైఫల్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ ఎపిక్ డిజాస్టర్ గా రాధే శ్యామ్ రికార్డులకు ఎక్కింది. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ ఆకట్టుకోలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే మాస్ మూవీ పడలేదు.

ఆ కోరిక సలార్ చిత్రంతో నెరవేరుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కొట్టి గత చిత్రాల రికార్డ్స్ తుడిచివేస్తుందని కలలు కంటున్నారు. కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ సిల్వర్ స్క్రీన్ పై నయా హిస్టరీ లిఖించారు. అది ప్రభాస్ సలార్ మూవీతో రిపీట్ చేస్తారనే విశ్వాసంతో అందరూ ఉన్నారు. కాగా సలార్ షూట్ అనుకోని కారణాలతో ఆలస్యం అయ్యింది. అయితే 2023లోనే సలార్ థియేటర్స్ లో దిగుతుంది.
మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. అంటే కచ్చితంగా మరో 250 రోజుల్లో థియేటర్స్ లో దిగనుంది. ఇప్పటి నుండే ఫ్యాన్స్ రోజులు లెక్కబెట్టుకుంటున్నారు.అంతగా సలార్ కోసం వారు నిరీక్షిస్తున్నారు. వరుస పరాజయాలకు సలార్ మూవీతో సమాధానం చెప్పాలని అనుకుంటున్నారు. సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు.
కాగా ఇదే ఏడాది ప్రభాస్ నుండి మరో పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది. పౌరాణిక మూవీ ఆదిపురుష్ విడుదల తేదీ సైతం ప్రకటించారు. జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇటీవల అధికారిక ప్రకటన చేశారు. సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ విడుదల చేయాలనుకున్నారు. ఆదిపురుష్ టీజర్ పూర్తిగా నిరాశపరిచింది. విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలో మరో వంద కోట్లు అదనంగా కేటాయించి మెరుగులుదిద్దుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆదిపురుష్ మూవీపై ప్రభాస్ అభిమానుల్లో ఏమాత్రం ఆసక్తి లేదు.
250 more days to go to witness the most violent man rebelling worldwide on big screens!#Prabhas #Salaar#SalaarEuphoriaIn250Days pic.twitter.com/EaPMxqZtKO
— Prabhas (@PrabhasRaju) January 21, 2023