Daniel Sekhar Character: భీమ్లా నాయక్ ఇప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్, రానా లు కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి సాగర్ కె చంద్ర డైరెక్షన్ తీసుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాసిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషీయం మూవీకి ఇది రీమేక్ అని మనందరికీ తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటివరకు 120 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా దియేటర్లలో ఆడుతూనే ఉంది. అయితే ఈ మూవీలో రానా పాత్ర కు ముందుగా వేరే హీరోను అనుకున్నారట. అయ్యప్పనుమ్ మూవీకి ముందుగా పవన్ కళ్యాణ్ పాత్ర కు బాలకృష్ణను, డానియల్ శేఖర్ పాత్రకు మంచు విష్ణును తీసుకోవాలని అనుకున్నారట. ఇందుకోసం కొన్ని చర్చలు కూడా జరిగాయంట.
పైగా నందమూరి బాలకృష్ణ, మంచు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఈ కాంబో తెరమీదికి వస్తుందని అంతా అనుకున్నారు. కాకపోతే ఈ విషయం అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ వార్తలు వినిపిస్తున్న క్రమంలోనే హాసిని క్రియేషన్స్ సీన్ లోకి ఎంటర్ అయింది. ఇంకేముంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తెర మీదకు తీసుకు వచ్చింది. త్రివిక్రమ్ డైలాగ్స్ రాసే బాధ్యత తీసుకోవడంతో పాటు పవన్ ను ఒప్పించే బాధ్యత కూడా తీసుకున్నాడు.
పైగా యంగ్ డైరెక్టర్ సాగర్ ను కూడా అతనే లైన్ లోకి తీసుకొచ్చాడు. ఇక పవన్ కంటే ముందే రానాను ఈ సినిమాలో కి తీసుకువచ్చారు. ఇలా ఈ కాంబో మొత్తం అనుకోకుండా సెట్ అయింది. ఇలా రానా చేసిన డేనియల్ శేఖర్ పాత్రను మంచు విష్ణు మిస్ చేసుకున్నాడు. ఒకవేళ అతను ఈ పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేదో అని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.