Prabhas Project K: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకముందే అంచనాలను రేపిన చిత్రం ‘ప్రాజెక్ట్ K’..సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్..ఈ చిత్రం లో ప్రభాస్ కి జోడిగా దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు..ఇక ఈ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ పనితనం ఎలాంటిదో మనం మహానటి సినిమా ద్వారా చూసాము..మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ని తనకంటే ఎవ్వరు అద్భుతంగా తియ్యలేరు అనేంతలా ఆ చిత్రాన్ని మలిచాడు..ఇక ఈ సినిమాని టైం ట్రావెల్ ప్లాట్ లో తెరకెక్కుతుంది అని చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారి పాత్ర కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది.

నిన్న అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ కి సంబంధించిన ప్రీ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది..ఈ ప్రీ లుక్ లో ‘లెజెండ్స్ ఆర్ ఇమ్మొర్తల్’ అని ఉంటుంది..అంటే దానికి అర్థం ‘లెజెండ్స్ కి చావు అనేదే ఉండదు’ అని..ఈ కాప్షన్ ని బట్టి చూస్తుంటే అమితాబ్ బచ్చన్ ఇందులో ‘అశ్వద్ధామ’ పాత్ర ని పోషిస్తున్నట్టు తెలుస్తుంది..చాలా కాలం నుండి ఈ వార్త సోషల్ మీడియా లో ప్రచారం లోనే ఉంది..నిన్న ఆ కాప్షన్ చూసిన తర్వాత ఆయన అశ్వద్ధామ పాత్ర పోషిస్తున్నాడు అని ఖరారు అయిపోయింది..మన పురాణాల ఇతిహాసాల ప్రకారం వందల సంవత్సరాల నుండి 8 మంది మహానుభావులు చిరంజీవులు గా ఉన్నారు..వారిలో అశ్వర్దమా కూడా ఒకడు..మిగిలినవారు హనుమంతుడు, కింగ్ మహాబలి , వేదవ్యాస, విభీషణ, కృపాచార్య, పరుశురామా ,మరియు రిషి మార్కండేయ.

వీరిలో అశ్వద్ధామ పాత్ర ని తీసుకొని డైరెక్టర్ నాగ అశ్విన్ ప్రాజెక్ట్ K ప్లాట్ ని డెవెలప్ చేసినట్టు తెలుస్తుంది..మహాభారతం లో బ్రహ్మాస్త్రం ప్రయోగించి పాండవుల వంశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసిన అశ్వద్దామా ని శ్రీకృష్ణుడు ‘నీకు మరణం అనేదే ఉండదు..ఈ ధరిత్రి ఉన్నంత కాలం ఈ భూమి మీదనే కుష్టి రోగం తో బాధపడుతూ జీవిస్తావు..ఇదే నా శాపం’ అంటూ శపిస్తాడు..అప్పటి నుండి అశ్వర్దమా హిమాలయాల్లోనే ఉంటూ తపస్సు చేస్తూ మోక్షాన్ని పొందే ప్రయత్నం ఇప్పటికి చేస్తూనే ఉన్నాడు అని పలు ఆధారాలు కూడా ఉన్నాయి..అలాంటి అశ్వద్ధామ ప్రస్తుత జనాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాకి మూలకథ అట..వినేదానికి స్టోరీ ఎంతో ఆసక్తికరంగా ఉంది..సరైన టేకింగ్ తో ఈ చిత్రాన్ని తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టిస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.