https://oktelugu.com/

ఇదా అంబేద్కర్ కి ఇచ్చే గౌరవం?

  ఆధునిక భారతదేశ పితామహుడు, ఆర్కిటెక్షర్‌ ఆఫ్‌ ఇండియా,నవభారత రాజ్యాంగ నిర్మాత , డా॥ బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌ ఇంటి ( రాజగృహం) పై గుర్తు తెలియని దుండగులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు. ఇలా దాడి చేయడం ముమ్మాటికీ మనువాద ముస్కరుల ఉన్మాదానికి పరాకాష్ట అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుశ్చర్యలో భాగంగా ఇంట్లో ఉన్న మొక్కల కుండీలను ధ్వంసం చేశారు. ఇంటి వద్ద ఉన్న సిసి టివి లను కూడా ధ్వంసం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 8, 2020 / 08:16 PM IST
    Follow us on

     

    ఆధునిక భారతదేశ పితామహుడు, ఆర్కిటెక్షర్‌ ఆఫ్‌ ఇండియా,నవభారత రాజ్యాంగ నిర్మాత , డా॥ బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌ ఇంటి ( రాజగృహం) పై గుర్తు తెలియని దుండగులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు. ఇలా దాడి చేయడం ముమ్మాటికీ మనువాద ముస్కరుల ఉన్మాదానికి పరాకాష్ట అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

    ఈ దుశ్చర్యలో భాగంగా ఇంట్లో ఉన్న మొక్కల కుండీలను ధ్వంసం చేశారు. ఇంటి వద్ద ఉన్న సిసి టివి లను కూడా ధ్వంసం చేశారు. అద్దాలను కూడా పగుల గొట్టారు. రాజ్‌ గ్రుహ్ డా. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసం. ఈ ఇంటిని బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాల కోసం నిర్మించారు. ప్రపంచం నలుమూలల నుండి అంబేద్కర్ అనుచరులు రోజూ ఇక్కడకు వస్తారు. ఇది అంత ముఖ్యమైన ప్రదేశం. అంబేద్కర్ అనుచరులకు ఇది అత్యంత గౌరవనీయ భవనం . ఈ ఘటనకు  ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పాలపడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ ఘటన గురించి  అంబేద్కర్  కుటుంబ సభ్యులు పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  దీంతో రంగంలో దిగిన పోలీసులు దుండగుల కోసం వేట మొదలు పెట్టారు.

    అంబేద్కర్  ఇంటిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని, ఈ దేశాన్ని ఎలా రక్షించాలో మార్గం చూపిన మహాను బావుని ఇంటి మీద దాడి జరిగితే ఇది దేశం మీద దాడిగా భావించి ఆధుర్మార్గులను చట్ట పరంగా శిక్షించాలాని పలువురు డిమాండ్ చేస్తున్నారు.