Tollywood : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్. మొదటి సినిమాతోనే నన్ను నటనతో అందరిని ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈశ్వర్ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర చిత్రం పరాజయం పొందింది. ఇక ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలో తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం వర్షం. వర్షం సినిమా హీరోగా ప్రభాస్ కెరియర్ను మలుపు తిప్పింది అని చెప్పడంలో సందేహం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఘన విజయం సాధించింది. దివంగత డైరెక్టర్ శోభన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ విజయం సాధించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు జోడిగా త్రిష నటించిన సంగతి అందరికీ తెలిసిందే. గోపీచంద్, ప్రకాష్ రాజ్, సునీల్, సుమా కనకాల ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు. సుమ కనకాల ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు అక్కగా నటించారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ మేనల్లుడుగా నటించిన బుడ్డోడు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటాడు. వర్షం సినిమాలో ఈ బుడ్డోడి పాత్ర చాలా కీలకం. తెలుగులో పలు సినిమాలలో ఈ బుడ్డోడు నటించాడు. ఈ బుడ్డోడి పేరు అక్షయ్ బచ్చు. వర్షం సినిమాలో అక్షయ్ బచ్చు సుమ కనకాల కొడుకుగా, హీరో ప్రభాస్ కు మేనల్లుడుగా కనిపించాడు. అలాగే అక్షయ్ బచ్చు నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాలో కూడా హీరో నాగార్జునకు కొడుకుగా నటించాడు. అక్షయ్ హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఆ తర్వాత నాగార్జున సంతోషం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వర్షం సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. అక్షయ్ పలు సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. దాదాపుగా 45 యాడ్లలో నటించి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అలా మంచి గుర్తింపు ఉన్న సమయంలో తన చదువుల కోసం సినిమాలకు దూరమయ్యాడు అక్షయ్. కానీ ప్రస్తుతం అక్షయ్ గాయకుడిగా ఉన్నాడని సమాచారం. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించి మెప్పించిన అక్షయ్ ప్రస్తుతం హిందీలో పలు సినిమాల్లో పాటలు పాడి ఫేమస్ అయ్యాడు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అక్షయ్ అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అక్షయ్ బచ్చు లేటెస్ట్ ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటె ప్రస్తుతం హీరో ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్,మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు