Prabhas : యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్(Prabhas)…ఆయన చేసిన సినిమాలో వరుసగా మంచి విజయాలను సాధిస్తున్నాయి. బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక సలార్(Salaar), కల్కి (Kalki) లాంటి సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించిన ఆయన ఇప్పుడు హను రాఘవపూడి (Hanu Raghavpudi) దర్శకత్వంలో ఫౌజి (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పటికే ఆయన సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.
Also Read : ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ వల్ల కెరియర్ పోగొట్టుకున్న స్టార్ హీరో…
మరి ఈ సినిమాకు సంబంధించిన డేట్స్ ని ఎప్పుడు కేటాయిస్తాడనే విషయంలోనే చాలా వరకు సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది…ఇక ప్రస్తుతం ఆయన ఫౌజీ సినిమా అయిపోయిన వెంటనే కల్కి 2 (Kalki 2) సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కల్కి 2 తో పాటుగా స్పిరిట్ సినిమాకి కూడా డేట్స్ ని అడ్జస్ట్ చేయాలనే ప్రయత్నంలో ప్రభాస్ ఉన్నారట.
కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం కల్కి అయిపోయిన తర్వాత తనకు డేట్స్ ఇవ్వమని చెప్పారట. ఒకేసారి రెండు సినిమాలు చేస్తే రెండు సినిమాల్లో ప్రభాస్ లుక్ అనేది ఒకే విధంగా ఉంటుంది. అలా కాకుండా స్పిరిట్ సినిమాకి సెపరేట్ గా డేట్స్ ఇస్తే ఆయన ప్రభాస్ కి ఒక డిఫరెంట్ మెకోవర్ ఇచ్చి చాలా పర్ఫెక్ట్ గా ప్రభాస్ ని ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగా తన సినిమాతో ఒక పర్ఫెక్షన్ ని చూపిస్తాడు. కాబట్టి ప్రభాస్ అన్ని సినిమాలు ముగిసిన తర్వాత తన సినిమాకి డేట్స్ ఇవ్వమని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ లోపు సందీప్ రెడ్డివంగా మరేదైనా సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక కల్కి, స్పిరిట్ ల తర్వాత సలార్ 2 (Salaar 2) మీద తన డేట్స్ ని కేటాయించే అవకాశాలైతే ఉన్నాయి.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?