Prabhas: బాహుబలి సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా నేపథ్యంలోనే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో క్రేజీ ప్రాజెక్ట్ అయినా “ప్రాజెక్ట్ K” ఒకటి .సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి మరో తాజా అప్డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
బయోపిక్ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ప్రాజెక్ట్ k”. ఈ సినిమా లో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొని నటిస్తున్నారు. అలానే బాలీవుడ్ స్టార్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్ ఈ సినిమా లో ఒక కీలకమైన పాత్రలో నటించడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్.ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్లో 50వ చిత్రంగా నిర్మించడం మరో విశేషంగా చెప్పాలి .ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలే ఈ చిత్ర బృందం అమితాబ్ తో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ “ఆదిపురుషో” షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసిన డార్లింగ్ మరో చిత్రమైన “సలార్” చిత్రీకరణలో పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే వచ్చే నెల డిసెంబర్ నుంచి బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి . చూడాలి మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమవుతాయి అనేది. ప్రభాస్ మరో చిత్రం “రాధేశ్యామ్”వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది.