https://oktelugu.com/

Prabhas: తన సినిమాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్

Prabhas: ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో ప్రభాస్ కూడా రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్లులో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. కాగా ఆ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 7, 2022 / 12:15 PM IST
    Follow us on

    Prabhas: ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో ప్రభాస్ కూడా రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్లులో పాల్గొంటున్నాడు.

    Prabhas

    అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. కాగా ఆ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి అడిగిన ప్రశ్నకు తాను సోషల్ మీడియాలో తక్కవ యాక్టివ్‌గా ఉంటానని తెలిపారు డార్లింగ్. కాగా రాబోయే రోజుల్లో తను సోషల్ మీడియా యాక్టివిటీని ఇంకా తగ్గిస్తానని అన్నారు. కానీ సినిమాల రూపంలో అభిమానులకు మరింత చేరువవుతానని అభిమానులకు మాట ఇచ్చాడు.

    అయితే ఇది ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సినిమాల వేగం పెంచుతాను అని, కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండను అని ప్రభాస్ క్లారిటీగా చెప్పాడు. ఇక ‘రాధేశ్యామ్’ కథ.. ఓ రియల్‌ స్టోరీ అని టాక్ నడుస్తోంది. సినిమా ఓపెనింగ్ లోనే.. ఓ ట్రైన్‌ 106 మంది ప్యాసింజర్లతో రోమ్‌ కి బయలుదేరుతుంది.

    Prabhas

    అయితే, అ ట్రైన్‌ ఓ టన్నేలోకి వెళ్లి తిరిగి బయటకు రాదు. అసలు ఆ ట్రైన్‌ ఏమైపోయింది ? అందులోని ప్యాసింజర్లు ఏమయ్యారు ? అనే మిస్టరీతో సినిమాలో టెన్షన్ మొదలవుతుంది. కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    Tags