https://oktelugu.com/

MLA Roja: ఎమ్మెల్యే రోజా భవితవ్యం ఈ సాయంత్రానికి తేలిపోనుందా?

MLA Roja: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడే రెండున్నర ఏళ్ల తర్వాత మరోసారి క్యాబినేట్ కూర్పు ఉంటుందని తేల్చిచెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తోంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతమున్న  క్యాబినేట్ నే సీఎం జగన్ ఇప్పటిదాకా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే జగన్ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ నేటితో చివరిరోజని తెలుస్తోంది. ప్రస్తుత క్యాబినెట్లోని ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ తమ మంత్రి పదవుల రాజీనామా చేయాలని సీఎం జగన్మోహన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2022 12:17 pm
    Follow us on

    MLA Roja: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడే రెండున్నర ఏళ్ల తర్వాత మరోసారి క్యాబినేట్ కూర్పు ఉంటుందని తేల్చిచెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తోంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతమున్న  క్యాబినేట్ నే సీఎం జగన్ ఇప్పటిదాకా కొనసాగిస్తూ వస్తున్నారు.

    MLA Roja

    MLA Roja

    అయితే జగన్ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ నేటితో చివరిరోజని తెలుస్తోంది. ప్రస్తుత క్యాబినెట్లోని ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ తమ మంత్రి పదవుల రాజీనామా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా క్యాబినేట్లోకి ఎవరెవరు వస్తారనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.

    కొత్త క్యాబినెట్లో చోటు దక్కించుకునేందుకు ఆశావహులంతా పోటీ పడుతున్నారు. ఈ క్యాబినేట్ తోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లనుండటంతో ఎవరెవరికీ మంత్రి పదవులు దక్కుతాయా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ లిస్టులో రోజా పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. కొత్త జిల్లాల విభజన అంశం కూడా రోజాకు కలిసి వస్తుందనే చర్చ కూడా నడుస్తోంది.

    వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి రోజాను టీడీపీపై అస్త్రంగా వాడుకున్నారు. రోజా సైతం ఎక్కడా తగ్గకుండా టీడీపీ నేతలను తన మాటలతో ఇరుకునపెట్టారు. ఈక్రమంలోనే ఎమ్మెల్యే రోజా గతంలో అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ కావడంలో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

    వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలి క్యాబినేట్లోనే ఆమె పదవీ దక్కుతుందని ఆశించారు. అయితే కుల సమీకరణాల్లో భాగంగా ఆమెకు మంత్రి పదవీ దక్కలేదు. ఆ తర్వాత ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవీ దక్కినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అయితే ఇప్పుడు మరోసారి క్యాబినేట్ మార్పు జరుగుతుండటంతో ఆమె పదవీ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

    వైసీపీలోని మహిళా నేతలందరిలోనూ ఎమ్మెల్యే రోజా ముందంజలో ఉంటారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ గానే కాకుండా సినిమా గ్లామర్ కూడా ఆమెకు కలిసి రానుంది. ఇక ఇటీవల జరిగిన జిల్లాల విభజన అంశం కూడా ఆమె కలిసొస్తుందని ఆమె అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.

    రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో కొన్ని మండలాలు తిరుపతిలోనూ, మరి కొన్ని మండలాలు చిత్తూరు జిల్లాలోకి వెళ్లాయి. దీంతో నగరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని రోజా సీఎం జగన్ కు విన్నవించారు. ఆ తర్వాత నగరి రెవెన్యూ డివిజన్ గా, పుత్తూరు మరి కొన్ని మండలాలు తిరుపతి జిల్లాలో చేర్చారు.

    దీనిపై ముందు నుంచి అభ్యంతరాలు తెలిపిన రోజా ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అందుకు కారణం మంత్రి పదవేనని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని కాదని జగన్ ఆమెకు పదీ ఇచ్చే అవకాం లేదు. దీంతో ఆమెకు తిరుపతి జిల్లా నుంచి మంత్రి పదవీ ఖాయమనే టాక్ విన్పిస్తోంది.

    ఈ సాయంత్రానికి కలా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమెకు శుభవార్త చెప్పే అవకాశం కన్పిస్తోంది. మొత్తానికి ఒకటి రెండ్రోజుల్లో రోజాకు మంత్రి పదవీ దక్కుతుందా? లేదా అనేది తేలిపోనుంది. గతంలోలోగా చివరి నిమిషంలో ఏమైనా రాజకీయ సమీకరణాలు మారుతాయా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!