Mahesh Trivikram Movie: త్రివిక్రమ్ పై నిర్మాతలకు నమ్మకం ఎక్కువ. పైగా మహేష్ బాబు హీరో అంటే.. ఇక ఆ సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేష్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకి మాత్రం బడ్జెట్ విషయంలో బోలెడు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అసలు ఇప్పుడు పెద్ద హీరోల సినిమాకు రూ. 100 కోట్లు మినిమం బడ్జెట్ అయిపోయింది.

ఈక్రమంలో ప్రస్తుతం త్రివిక్రమ్-మహేష్ సినిమా హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఈ సినిమాకి మహేష్ రెమ్యునరేషన్ ఎంతలేదన్నా రూ. 50 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక అల వైకుంఠపురములో.., భీమ్లా నాయక్‌తో త్రివిక్రమ్ కూడా రేంజ్ పెంచేశాడు. దాదాపు మహేష్‌కి సమానంగా తీసుకుంటున్నాడట. ఈ లెక్కన సినిమాకి రూ.200 కోట్లు ఖాయంగా కనిపిస్తోంది ?
కాగా త్రివిక్రమ్ ఇచ్చిన బడ్జెట్ మరీ ఎక్కువ ఉంది అని మహేషే ఆలోచనలో పడ్డాడు. కారణం.. మహేష్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. అందుకే, మహేష్ బడ్జెట్ విషయంలో కాస్త వెనకాముందు ఆలోచిస్తున్నాడట. నిజానికి మహేష్ కి హిందీలో మార్కెట్ లేదు. అలాగే త్రివిక్రమ్ కి కూడా హిందీలో మార్కెట్ లేదు.

మరి పాన్ ఇండియా బడ్జెట్ పెట్టి సినిమా చేస్తే.. హిందీలో ఎంతవరకు మార్కెట్ అవుతుంది అనేదే డౌట్. అందుకే, బడ్జెట్ ను ఓవర్ గా పెట్టకపోవడమే మంచిది అని మహేష్ నిర్మాతలకు చెబుతున్నాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా సినిమాకి పాన్ ఇండియా బడ్జెట్ లేకపోతే వర్కౌట్ కాదు అని బడ్జెట్ విషయం పై అస్సలు తగ్గడం లేదు. చివరకు మహేష్ – త్రివిక్రమ్ లలో ఎవరు కాంప్రమైజ్ అవుతారో చూడాలి.