Prabhas
Prabhas: ప్రభాస్ చాలా రోజులుగా విదేశాల్లో ఉంటున్నారు. ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభాస్ ఎయిర్ పోర్ట్ లో నడిచొస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ యూరప్ వెళ్లినట్లు సమాచారం. చాలా కాలంగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. బాహుబలి సిరీస్ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. వ్యాయామంతో పాటు యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నాడు. రిస్కీ స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆయన మోకాలికి గాయమైందట.
ఏళ్లుగా నొప్పికి తాత్కాలిక చికిత్స తీసుకుంటున్న ప్రభాస్ సర్జరీ చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్జరీ అనంతరం నాలుగు వారాలకు పైగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారట. దీంతో విదేశాల్లోనే ఆయన రెస్ట్ తీసుకున్నారు. సలార్ విడుదల నేపథ్యంలో ఇండియాలో అడుగుపెట్టారు.
ఎయిర్ పోర్ట్ లో ఆయన నెమ్మదిగా నడుస్తుస్తు కనిపించారు. గాయం పూర్తి నయం కాలేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. మరికొద్ది రోజులు ప్రభాస్ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకునే అవకాశం కలదు. అనంతరం ఆయన సలార్ ప్రమోషన్స్ పాల్గొనాల్సి ఉంది. సలార్ పాన్ ఇండియా మూవీ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఆయన సంచరించాల్సి ఉంటుంది. అలాగే ప్రభాస్ నటిస్తున్న రాజా డీలక్స్, కల్కి సెట్స్ పై ఉన్నాయి. ఈ చిత్రాల షూటింగ్స్ షెడ్యూల్స్ సిద్ధంగా ఉన్నాయి.
ఇక సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. వరల్డ్ వైడ్ రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. సలార్ ఓటీటీ రైట్స్ రూ. 160 కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం. సలార్ రెండు భాగాలుగా విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. సలార్ లో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు.