https://oktelugu.com/

XIaomi Su7 Electric Car  : ఒక్కరోజులోనే లక్ష ఆర్డర్లు.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 800 కిలోమీటర్లు.. ఈ కారు మాములిది కాదు బ్రో..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల హవా సాగుతోంది. చాలా కార్ల కంపెనీలు పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానాల్లో ఈవీలను తీసుకొస్తున్నారు. భారత్ లోనూ మారుతి సుజుకీ నుంచి హ్యుందాయ్ వరకు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి పైనే ఫోకస్ పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పటి వరకు మొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న షావోమీ ఇప్పుడు కార్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ‘XIaomi Suv7 Electric’ పేరుతో కొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 22, 2024 11:57 am
    Follow us on

    XIaomi Su7 Electric Car :  ప్రస్తుత మొబైల్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు పోటీ పడుతున్నాయి. కానీ చైనాకు చెందిన Xiaomi (షావోమి) కంపెనీ మిగతా వాటికి గట్టి పోటీ ఇస్తుంది. భారత్ లో చాలా మంది వద్ద షావోమీ ఫోన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఆటోమోబైల్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్న విషయం ఇప్పటికే తెలిసింది. ఇందులో భాగంగా షావోమీ కంపెనీ నుంచి ఓ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చింది. అయితే భారత మార్కెట్లోకి కాదు చైనా మార్కెట్లోకి. ఈ కారు వచ్చి రాగానే అక్కడి ప్రముఖ కంపెనీ టెస్లాను వెనక్కి నెట్టేసింది. ఈ కారులో ఉన్న ఫీచర్స్, ఆకర్షణీయమైన లుక్ కారు వినియోగదారులను వీపరీతంగా ఆకర్షించింది. దీంతో ఈ కారు కోసం ఎగబడుతున్నారు. షావోమీ కంపెనీ ఇండియన్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ నేపథ్యంలో షావోమీ రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ కారు కూడా మార్కెట్లోకి వస్తుందా? అని కొందరు ప్రశ్నించారు. అయితే ఈ విషయంపై ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ప్రస్తుతం ఈ కారు ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం లేనట్లే తెలుస్తోంది. కానీ షావోమి ఎలక్ట్రిక్ కారు గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఈ కారుకు ఉన్న ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ కారు ఇచ్చే మైలేజ్ పై ఆటోమోబైల్ వ్యాప్తంగా ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. మరి ఈ కారు ఎలా ఉంది? దీని ధర ఎంతో తెలుసుకోవాలని ఉందా? అయితే వివరాల్లోకి వెళ్తాం పదండి..

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల హవా సాగుతోంది. చాలా కార్ల కంపెనీలు పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానాల్లో ఈవీలను తీసుకొస్తున్నారు. భారత్ లోనూ మారుతి సుజుకీ నుంచి హ్యుందాయ్ వరకు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి పైనే ఫోకస్ పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పటి వరకు మొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న షావోమీ ఇప్పుడు కార్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ‘XIaomi Suv7 Electric’ పేరుతో కొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది.

    SUV వేరియంట్ లో వచ్చిన ఈ కారు రిలీజ్ అయినా ఒక్క రోజులోనే లక్ష ఆర్డర్లు వచ్చాయి దీంతో ఇక్కడ ప్రముఖంగా ఉన్న టెస్లా కంపెనీని వెనక్కి నెట్టినట్లయింది. షావోమీ ఎలక్ట్రిక్ కారులో 101 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 800 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇది 5 మీటర్ల పొడవుతో ప్రీమియం సెడాన్ ను పోలి ఉంటుంది. ఈ కారును ప్రస్తుతం చైనా మార్కెట్లో 2,15,900 యూవాన్ లతో విక్రయిస్తున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.25 లక్షలు. ఎక్స్ టీరియర్ డిజైన్ స్టైలిష్ లుక్ లో ఉండి మరించి ఆకర్షిస్తోంది.

    భారత్ లో ఈ కారను తీసుకొస్తారా? అనే ప్రశ్నలపై షావోమీ కంపెనీ ప్రతినిధులు మాత్రం సందిగ్ధ సమాధానాలే చెప్పారు. అయితే భవిష్యత్ లో కచ్చితంగా తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో షావోమీ కంపెనీకి మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తే సక్సెస్ అవుతుందని అంటున్నారు.ఒక వేళ భారత్ కు వస్తే దీనిని రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు విక్రియించనున్నారు. ఇందులో డ్యూయెల్ మోటార్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం సింగిల్ మోటార్ వెర్షన్ మాత్రమే విక్రయించనున్నారు. వినియోగదారుల అభిరుచులను, ఇప్పుడు రిలీజ్ చేసిన కారు ఆదరణను బట్టి నెక్ట్స్ లెవల్ కు వెళ్లే అవకాశం ఉంది.