మద్యం ఎఫెక్ట్… సరిహద్దు అలెర్ట్!

తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాలలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఏపీకి చెందిన మద్యం ప్రియులు తెలంగాణ వచ్చి మందు కొనుగోలు చేస్తున్నారు. అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆంధ్ర లో మద్యం ధరలకంటే తెలంగాణలో మద్యం ధరలు చాలా తక్కువ కావడం ఒక కారణమైతే, ఏపీలో కొత్త బ్రాండ్లు రావడంతో.. అవి ఇష్టపడని మందుబాబులు తెలంగాణ వైపు మొగ్గు చూపడం మరో కారణం. ఈ రెండింటి నడుమ ఆంధ్ర మందుబాబులు తెలంగాణ మద్యం దుకాణాలు వైపు […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 5:20 pm
Follow us on

తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాలలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఏపీకి చెందిన మద్యం ప్రియులు తెలంగాణ వచ్చి మందు కొనుగోలు చేస్తున్నారు. అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆంధ్ర లో మద్యం ధరలకంటే తెలంగాణలో మద్యం ధరలు చాలా తక్కువ కావడం ఒక కారణమైతే, ఏపీలో కొత్త బ్రాండ్లు రావడంతో.. అవి ఇష్టపడని మందుబాబులు తెలంగాణ వైపు మొగ్గు చూపడం మరో కారణం. ఈ రెండింటి నడుమ ఆంధ్ర మందుబాబులు తెలంగాణ మద్యం దుకాణాలు వైపు చూస్తున్నారు.

దాదాపు 40 రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో మద్యం అమ్మకాలకు ఆయా ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే ఆంధ్రలో మద్యం ధరలను 75 శాతం పెంచగా, తెలంగాణలో 16 శాతమే మద్యం ధరలను పెంచారు. దీంతో సరిహద్దు ప్రాంతం వారు తెలంగాణలోనే మద్యం కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ఏపీలో కొత్త బ్రాండ్లు రావడంతో.. అవి ఇష్టపడని మందుబాబులు తెలంగాణ వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో వైన్ షాపుల వద్ద పాత బ్రాండ్లే కనిపిస్తున్నాయి. లిక్కర్ ఎమ్మార్పీ పట్టికలో కూడా పాత బ్రాండ్ల పేర్లే ఉన్నాయి. ఏపీలో మాత్రం కొత్త బ్రాండ్లు హల్ చల్ చేస్తున్నాయి. మద్యం ప్రియులు ఒక బ్రాండ్‌ కు అలవాటుపడిన తర్వాత.. ఇప్పుడు కొత్త బ్రాండ్లు రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీలో మద్యం ప్రియులు తెలంగాణవైపు మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా సరిహద్దు ప్రాంతాలను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు మందుబాబుల పుణ్యమా అని మరిన్ని కఠినమైన ఆంక్షలను సరిహద్దు ప్రాంతాల్లో అమలుపరుస్తున్నారు.