
Prabhas is sick : ప్రభాస్ అనారోగ్యం బారిన పడినట్లు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. దీంతో ఆయన షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకున్నారట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభాస్ రాజా డీలక్స్ లేటెస్ట్ షెడ్యూల్ లో పాల్గొనాల్సి ఉంది. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ గత ఏడాది మొదలైంది. ఓ షెడ్యూల్ కూడా జరుపుకుంది. తాజా షెడ్యూల్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సడన్ గా ప్రభాస్ కి జ్వరం బారినపడ్డారు. దీంతో రాజా డీలక్స్ షూట్ కి బ్రేక్ పడింది. హై ఫీవర్ నుండి ప్రభాస్ కోలుకున్నప్పటికీ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారట.
ఫిబ్రవరిలో అనుకున్న రాజా డీలక్స్ సెకండ్ షెడ్యూల్ మార్చికి షిఫ్ట్ అయిందంటున్నారు. ఇక ప్రభాస్ కి జ్వరం అన్న విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని,పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్స్ లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు. రాజా డీలక్స్ కోసం పాతకాలపు థియేటర్ ని తలపించే ఓ భారీ సెట్ వేశారట. అందులో ప్రభాస్ తో పాటు కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.
అనూహ్యంగా ఇది హారర్ కామెడీ మూవీ అని ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే అసలు ప్రభాస్ ఇమేజ్ కి ఈ జోనర్ సెట్ అవుతుందా అనే సందేహాలున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డీలక్స్ రాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకుండానే ప్రభాస్ స్టార్ట్ చేయడం విశేషం. నిజానికి ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో ఆసక్తి లేదు. పైగా అసహనం ఉంది.
కొత్త దర్శకులతో చేసిన సాహో, రాధే శ్యామ్ చేదు అనుభవాలు మిగిల్చిన నేపథ్యంలో మారుతీతో అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ వద్దంటూ ఫ్యాన్స్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేశారు. ప్రభాస్ మాత్రం చేయాలని ఫిక్స్ అయ్యాడు. షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రభాస్ నుండి రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. జూన్ 16న ఆదిపురుష్, సెప్టెంబర్ 28న సలార్ థియేటర్స్ లో దిగనున్నాయి. ప్రాజెక్ట్ కే వచ్చే ఏడాది విడుదలయ్యే సూచనలు కలవు.