
Chiranjeevi : పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే పది అడుగులు ముందుకి వేస్తుందని పెద్దలందరూ అంటూ ఉంటారు..ఆ సామెత మెగాస్టార్ చిరంజీవి సరిగ్గా సరిపోతుంది.ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు..మొదటి రోజు నుండి నేటి వరకు ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యే రేంజ్ వసూళ్లను రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతూనే ఉంది.
అయితే ఈ సినిమాకి ముందు చిరంజీవి నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపొయ్యేసరికి చిరంజీవి వయస్సు అయిపోయింది కదా, ఈ వయస్సు లో ఆయన నుండి రికార్డ్స్ ఆశించలేము..రిటైర్ అయిపోతే మంచిది అంటూ మెగా అభిమానులు సైతం సలహాలు ఇవ్వడం ప్రారంభించారు.కానీ మూడు నెలలు తిరగకుండానే బాక్స్ ఆఫీస్ వీపు వాచిపొయ్యేలా కొట్టి రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు మన మెగాస్టార్.
వాల్తేరు వీరయ్య చిత్రం విడుదలై నేటికి పాతిక రోజులు పూర్తి అయ్యాయి..ఈ పాతిక రోజులకు గాను ఈ సినిమా దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..ఇప్పటి వరకు టాలీవుడ్ లో రాజమౌళి సినిమా కాకుండా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం..ఒక్కసారి టాలీవుడ్ టాప్ 6 సినిమాల లిస్ట్ తీస్తే మొదటి స్థానం లో #RRR చిత్రం ఉండగా, రెండవ స్థానం లో బాహుబలి 2 , మూడవ స్థానం లో బాహుబలి , నాల్గవ స్థానం లో అలా వైకుంఠపురం లో , ఐదవ స్థానం లో సై రా నరసింహా రెడ్డి మరియు ఆరవ స్థానం లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు నిలిచాయి.
ఈ లిస్ట్ లో రెండు సినిమాలు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు తప్ప మరో స్టార్ హీరో దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం..68 ఏళ్ళ వయస్సు లో ఈ రేంజ్ రికార్డ్స్ పెట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.అందుకే ఆయనని అందరూ మెగాస్టార్ అని పిలుస్తారు.