Prabhas Next Film: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం, కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతీ ప్రాంతం లోనూ ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్ కి 50 శాతం కి పైగా నష్టాలు. నిర్మాత కి అయితే పెట్టిన బడ్జెట్ రేంజ్ లో బిజినెస్ జరగలేదు. నష్టాల్లోనే విడుదల చేసాడు, కానీ విడుదల తర్వాత వంద కోట్ల నష్టాలను మిగిలించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే మరో భారీ డిజాస్టర్ గా నిల్చింది. ‘కల్కి’ తో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ కి, తన తదుపరి చిత్రం ‘రాజా సాబ్’ కి కేవలం 180 కోట్ల క్లోజింగ్ తో సరిపెడుతాడని అభిమానులు కలలో కూడా ఊహించలేదు. అంటే ‘కల్కి’ కి మొదటి రోజు వచ్చిన వసూళ్లు, ‘రాజా సాబ్’ కి క్లోజింగ్ లో వచ్చాయి. దీనిని బట్టీ ఈ చిత్రం ఎంతటి డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. ఈయన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఎంత పొగిడాడో మనమంతా చూసాము. ఈ సినిమాకు అసలు హీరో ఆయనే అని, బడ్జెట్ పెరిగిపోయినా, మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చిన వెన్ను చూపించకుండా, బలంగా నిలబడి ఈ చిత్రాన్ని పూర్తి చేసాడని, ఇలాంటి నిర్మాతలు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎంతో అవసరమని చెప్పుకొచ్చాడు. ఆరోజు ప్రభాస్ మాటలను బట్టీ చూస్తే, భవిష్యత్తులో ఆయన ఈ బ్యానర్ లో మరో సినిమా చేస్తాడేమో అనే అనుమానం అభిమానుల్లో కలిగింది. వాళ్ళ అనుమానాలకు తగ్గట్టుగానే, ప్రభాస్ త్వరలో ఈ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడని టాక్. ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త.
ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉగ్రరూపాన్ని సోషల్ మీడియా లో చూడొచ్చు. గత రెండు రోజులుగా డైరెక్టర్ మారుతీ ని రాజా సాబ్ లాంటి సినిమాని తీసినందుకు అడ్డమైన బూతులు తిడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ బ్యానర్ లో ఇంకో సినిమా , అది కూడా రాధే శ్యామ్ డైరెక్టర్ తో అంటే ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో బిజీ ఉన్నాడు. వచ్చే నెల నుండి కల్కి మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇలా ఇన్ని క్రేజీ కాంబినేషన్స్ సినిమాల మధ్య, మళ్లీ ఇలాంటి చిన్న డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.