Top 10 Telugu movies on Netflix: లాక్ డౌన్ తర్వాత ఆడియన్స్ ఓటీటీ లకు ఎంత అలవాటు పడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకానొక దశలో థియేటర్స్ కి జనాలు రావడం కూడా మానేశారు. ఆ రేంజ్ ప్రభావం పడింది. ఇప్పటికీ కూడా ఒక సెక్షన్ ఆడియన్స్ ఓటీటీ లకు అలవాటు పడి మీడియం రేంజ్ సినిమాలను థియేటర్స్ లో చూడడం మానేశారు. ఇక మన ఇండియా లో అత్యధిక శాతం మంది ఉపయోగించే ఓటీటీ లలో ఒకటి నెట్ ఫ్లిక్స్. అద్భుతమైన వెబ్ సిరీస్, సరికొత్త సినిమాలు ఈ మాధ్యమం లో అందుబాటులో ఉంటాయి. మన తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ 10 సినిమాలేంటో ఒకసారి చూద్దాం.
1) #RRR : రామ్ చరణ్(Global Star Ram Charan), ఎన్టీఆర్(Junior NTR), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కి సంబంధించిన హిందీ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. కేవలం భారతీయులు మాత్రమే కాకుండా , పశ్చిమ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు. ఫలితంగా ఈ చిత్రానికి 45 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడానికి కారణం కూడా ఈ రీచ్ వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
2) లక్కీ భాస్కర్(Lucky Bhaskar): దుల్కర్ సల్మాన్(Dulquer Salman) హీరో గా నటించిన ఈ చిత్రం థియేటర్స్ లో కంటే నెట్ ఫ్లిక్స్ లోనే ఎక్కువ సక్సెస్ ని అందుకుంది. 2024 లో విడుదలైన ఈ సినిమాకు, ఇప్పటి వరకు దాదాపుగా 29.5 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని రెండవ స్థానం లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా దరిదాపుల్లోకి కూడా రీసెంట్ గా విడుదలైన సినిమాలు రాకపోవడం గమనార్హం.
3) హాయ్ నాన్న(Hai Nanna): నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ వీక్షకులు ఎగబడి చూసారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ కి ఈ చిత్రం తెగ నచ్చేసింది. ఇప్పటికీ కూడా డీసెంట్ స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ చిత్రానికి 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
4) పుష్ప 2(Pushpa 2 : The Rule) : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమాకు, నెట్ ఫ్లిక్స్ లో కూడా ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 20.2 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతానికి ఈ చిత్రం నాల్గవ స్థానం లో కొనసాగుతుంది.
5) గుంటూరు కారం(Guntur Karam) : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) కెరీర్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. అలాంటి ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు అందిస్తున్న గణాంకాల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు ఈ చిత్రానికి 20.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దేశాన్ని ఒక ఊపు ఊపిన ‘పుష్ప 2’ తో సమానంగా ఈ ఫ్లాప్ సినిమాకు వ్యూస్ వచ్చాయంటే చిన్న విషయం కాదు.
6) సలార్(Salar : The Cease Fire) : ప్రభాస్(Rebel Star Prabhas) కం బ్యాక్ చిత్రం గా నిల్చిన ‘సలార్’ బాక్స్ ఆఫీస్ పరంగా 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది భారీ వసూళ్లే, కానీ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి అంతకు మించిన ఆదరణ దక్కింది. పైన చెప్పిన సినిమాలన్నిటికీ అన్ని వ్యూస్ రావడానికి ముఖ్య కారణం హిందీ వెర్షన్ ఉండడం. కానీ ఈ చిత్రం హిందీ వెర్షన్ లేకుండానే విడుదలైంది. అయినప్పటికీ కూడా 19.1 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి.
7) దేవర(Devara Movie) : #RRR తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నుండి వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. థియేటర్స్ లో అత్యంత ఆదరణ పొందిన ఈ సినిమాని, నెట్ ఫ్లిక్స్ లో కూడా బాగా ఆదరించారు. ఈ చిత్రానికి దాదాపుగా 17.8 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు సమాచారం.
8) హిట్ 3 : నాని హీరో గా నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై థియేటర్స్ లో పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కానీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. గత ఏడాది నుండి ఇప్పటి వరకు ఈ చిత్రానికి 14.7 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు సమాచారం.
9) సరిపోదా శనివారం : 2024 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం నాని కెరీర్ లో రెండవ 100 కోట్ల గ్రాస్ సినిమాగా నిల్చింది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు 13.9 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు సమాచారం.
10) కల్కి 2898 AD : ప్రభాస్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా నిల్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదలైంది. ఈ హిందీ వెర్షన్ కి దాదాపుగా 12.5 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు సమాచారం.
ఇక గత ఏడాది చివర్లో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి ఇప్పటి వరకు 8.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ చిత్రం 10 మిలియన్ వ్యూస్ మార్కుని అందుకోబోతుంది. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన భోళా శంకర్ చిత్రానికి 8.2 మిలియన్ వ్యూస్ రావడం, అదే విధంగా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి కేవలం 7 మిలియన్ వ్యూస్ రావడం గమనించాల్సిన విషయం.
Most Viewed Telugu Films on Netflix pic.twitter.com/XlFdMLeKBP
— (@filmy_view) January 22, 2026