US Secret Weapon: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. ఏడాది పాలనలో అమెరికా ఫస్ట్ అంటూ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో అమెరికన్లు, ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇక నోబెల్ ప్రైజ్ కోసం అయితే యుద్ధాలను ఆపినట్లు యాక్షన్ చేశారు. తానే యుద్ధాలు ఆపానని చెప్పుకున్న ట్రంప్ ఇటీవల వెనుజువెలాలోని ఆయిల్ నిల్వల కోసం అక్కడ తమ అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వెనుజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఒక దేశంలో చొరబడి ఆ దేశ అధ్యక్షుడి ఇంటికి వెళ్లడమే కాకుండా అతని బెడ్‌రూంలోకి వెళ్లి మరీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అదుపులోకి తీసుకుని ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో న్యూయార్క్ తరలించారు. రక్షణ వ్యవస్థ రాడార్లు ఉండగా, అమెరికా సైన్యం సైలెంట్‌గా వెనుజువెలాలో చొరబడడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఎలా చేసి ఉంటారు..
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను అమెరికా సైన్యం అరెస్టు చేసిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో అగ్రరాజ్యం రహస్య ధ్వని ఆయుధాన్ని ఉపయోగించినట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రత్యేక మిషన్‌కు ’ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’ అనే పేరు పెట్టారు.
రహస్య ఆయుధాలతో దాడి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై తాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా వద్ద ఎవరూ తెలుసుకోని శక్తివంతమైన సాంకేతికత ఉంది. దాని గురించి ఎక్కువ చర్చ చేయకపోవడం మంచిదే. అది అద్భుత దాడి‘ అని ఒక వార్తా సంస్థకు చెప్పారు. ఈ ఆయుధం ప్రపంచంలో ఏ దేశం వద్ద లేదని వెల్లడించారు.
మదురో గార్డ్ షాకింగ్ వివరణ..
ఇదిలా ఉంటే.. వెనుజువెలాపై ఆపరేషన్ సమయంలో వెనెజువెలా భద్రతా సిబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి భయానకంగా ఉంది. ‘మా ముక్కుల నుంచి రక్తం రాగానే, కొందరు వాంతి చేసి, మిగిలినవారు నేలపై పడిపోయారు. ఆ ధ్వని ఆయుధం ముందు నిలబడలేకపోయాం’అని మదురో గార్డ్ వర్ణించాడు. ‘అమెరికాను ఢీకొట్టగలమనుకుందే మోసపోతాయి’ అని హెచ్చరించాడు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వార్త ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.