Mana shankara Varaprasad Garu 10 Days Collections: విడుదల రోజు నుండి మొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Varaprasad Garu) చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఈమధ్య కాలంలో నేటి తరం స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ రేంజ్ షేర్ వసూళ్లు నమోదు అవ్వలేదు కాబట్టి. అయితే నేటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ తగ్గిస్తారు అనే సమాచారం జనాల్లో ఉండడం వల్లో, ఏమో తెలియదు కానీ, నిన్న మాత్రం ఈ చిత్రానికి కాస్త వసూళ్లు డౌన్ అయ్యాయి. 9వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 10వ రోజున 2 కోట్ల 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే ముందు రోజుతో పోలిస్తే దాదాపుగా 50 శాతం డ్రాప్స్ నమోదు అయ్యాయి అన్నమాట.
ఓవరాల్ గా 10 రోజులకు గానూ ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా నమోదు అయినా వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. ముందుగా నైజాం ప్రాంతం విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 40.39 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రాయలసీమ ప్రాంతం నుండి 19.72 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 18.59 కోట్లు, తూర్పు గోదావరి నుండి 13.74 కోట్లు, పశ్చిమ గోదావరి నుండి 8.81 కోట్లు, గుంటూరు జిల్లా నుండి 10.12 కోట్లు, కృష్ణ జిల్లా నుండి 9.82 కోట్లు, నెల్లూరు జిల్లా నుండి 5.83 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా పది రోజులకు గాను ఈ చిత్రానికి 127 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 189 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 11.35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఓవర్సీస్ నుండి 18.40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 156 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 252 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. జనవరి 26 కి కచ్చితంగా ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి అంత దూరం ఈ సినిమా వెళ్తుందా లేదా అని. అదే కనుక జరిగితే ఈ చిత్రం ‘ఓజీ’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటినట్టు, మరో 20 కోట్లు అదనంగా రాబడితే ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని కూడా దాటినట్టే.