Aamir Khan marriage: బాలీవుడ్ లో రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉండే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్(Aamir Khan). ఇప్పటికీ ఆయన నటించిన ‘దంగల్’ చిత్రమే ఇండియా లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గా నెంబర్ 1 స్థానం లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ రికార్డ్స్ ని అమీర్ ఖాన్ మాత్రమే బ్రేక్ చేయాలి, అలాంటి డామినేషన్ చూపిస్తూ వచ్చాడు. ముఖ్యంగా గజినీ నుండి దంగల్ వరకు అమీర్ ఖాన్ ఫిల్మోగ్రఫీ ని చూస్తే ఆయన సృష్టించిన రికార్డులు ఎలాంటివి అనేది తెలుస్తుంది. అయితే ఈమధ్య కాలం లో అమీర్ ఖాన్ కాస్త జోరు తగ్గించాడు. ‘దంగల్’ తర్వాత ఆయన చేసిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఇండియా లో ఫ్లాప్ అయ్యింది కానీ, చైనా లో పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘తగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రాలు అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి.
ఈ రెండు ఫ్లాప్స్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఆయన నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్రం గత ఏడాది విడుదలై మంచి కమర్షియల్ సక్సెస్ గా నిల్చింది. ఇప్పుడు ఆయన ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే దానిపై స్పష్టమైన క్లారిటీ లేదు. ఇదంతా పక్కన ఈమధ్య కాలం లోనే ఆయన తన భార్య కిరణ్ రావు కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకులు ఇచ్చినప్పటికీ వీళ్లిద్దరు స్నేహంగానే ఉన్నారు. విడాకుల తర్వాత వీళ్లిద్దరు కలిసి రెండు చిత్రాలను నిర్మించారు. చరిత్ర ఇలాంటి సంఘటనలు మీరు గతంలో ఎప్పుడు చూసుండరు. ఇకపోతే చాలా కాలం నుండి ఆయన దంగల్ నటి ఫాతిమా తో డేటింగ్ లో ఉన్నాడని, త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని రీసెంట్ గానే తెలిసింది.
అయితే అమీర్ ఖాన్ గత ఏడాది తన 60వ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో తానూ గౌరీ స్ప్రాట్ అనే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నట్టు అధికారికంగా చెప్పుకొచ్చాడు. అప్పటికే ఏడాదిన్నర నుండి ఆమెతో రిలేషన్ లో ఉన్నాడు అమీర్. రీసెంట్ గా ఆయన గౌరీ గురించి మాట్లాడుతూ ‘నేను, గౌరీ ఒకరిని ఒకరు ఎంతో గౌరవించుకుంటాం, ప్రేమించుకుంటాం, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. మా దృష్టిలో వివాహం అంటే, రెండు మనసుల కలయిక, ఈ రకంగా చూస్తే మేమిద్దరం వివాహం చేసుకున్నట్టే. ప్రస్తుతం మెమ్మేమిద్దరం కలిసే ఉంటున్నాం. మా వివాహాన్ని అధికారికం చెయ్యాలా వద్దా అనేది భవిష్యత్తులో నిరాయించుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్.