Prabhas and Kriti Sanon: ప్రభాస్ సినిమాల్లో చాలా వైలెంట్ గా చాలా రొమాంటిక్ గా కనిపించినా.. బయట మాత్రం చాలా సిగ్గుతో బిడియంతో కనిపిస్తూ ఉంటాడు. మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపించడు. ఒకవేళ సినిమా ప్రమోషన్స్ కోసం తప్పక మీడియా ముందుకు వచ్చినా.. సింపుల్ గా తేల్చి పారేస్తాడు. ప్రభాస్ ఇటు మీడియాతోనే కాదు, అటు హీరోయిన్లతోనూ అసలు ఎక్కువగా మాట్లాడడు.

అందుకే ప్రభాస్ తో నటించిన హీరోయిన్స్ కూడా ప్రభాస్ గురించి ఎక్కువగా ప్రస్తావించారు. ఒకరు ఇద్దరు మాత్రం ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెబుతుంటారు. ఇప్పుడు ఆ ప్రత్యేక లిస్ట్ లో చేరింది కృతి సనన్. ప్రభాస్ కి సిగ్గు ఎక్కువే. ఐతే, అది పూర్తీ నిజం కాదంటోంది ఈ బ్యూటీ. కృతి సనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తోంది.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తున్నాడు. ఇక సీతగా కృతి కనిపించబోతుంది. ఇప్పటికే కృతి సనన్ ఈ సినిమాకు సంబధించి తన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
కృతి సనన్ మాటల్లోనే.. ‘ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ అనుకుంటారు. కానీ, ప్రభాస్ సిగ్గరి కాదు. కాకపొతే కొత్తవాళ్లతో ఎక్కువగా మాట్లాడడు. అయితే, ఎవరితోనైనా ప్రభాస్ చాలా ఫ్రెండ్లిగా ఉంటాడు. చిన్నా పెద్దా అని తేడా చూడకుండా అందర్నీ గౌరవిస్తాడు. ముఖ్యంగా తనతో క్లోజ్ అయితే ఇక అప్పుడు చెలరేగిపోతాడు,
గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉంటాడు’ అని కృతి చెప్పుకోచింది.
అలాగే తనకు ప్రభాస్ తో మంచి స్నేహం ఏర్పడిందని.. పెద్ద సూపర్ స్టార్ అయినా ప్రభాస్ ఎప్పుడూ టెక్కు చూపించడు అని, ప్రభాస్ పక్కా జెంటిల్ మేన్ అని కృతి తెలిపింది. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ సినిమాలో కృతి నటించింది. కానీ మహేష్ గురించి మాత్రం కృతి ఎప్పుడూ ఇలా చెప్పలేదు.
ఇక ‘ఆదిపురుష్’ షూటింగ్ విషయానికి వస్తే.. ఈ సినిమా దాదాపు పూర్తి అయింది. గ్రాఫిక్స్ వర్క్ మాత్రం ఇంకా చాలా ఉందని తెలుస్తోంది.