Pawan Kalyan OG: బిగ్ బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ లో ప్రభాస్..తదుపరి షెడ్యూల్ కి డేట్స్ కూడా ఫిక్స్?

కేవలం గ్లిమ్స్ వీడియో తప్ప ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఎలాంటి కంటెంట్ విడుదల కాలేదు. అయినప్పటికీ కూడా 'పుష్ప 2 ' తో సమానంగా, విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రంగా 'ఓజీ' నిల్చింది.

Written By: Vicky, Updated On : October 19, 2024 3:56 pm

Pawan Kalyan OG

Follow us on

Pawan Kalyan OG: ప్రస్తుతం టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలలో అభిమానులు, ప్రేక్షకులు సరిసమానమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఓజీ’. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై, ప్రారంభం నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉండేవి. కారణం పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్, రీమేక్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి, నేటి తరం యూత్ ఆడియన్స్ కి నచ్చే విధమైన కంటెంట్ ని ఎంచుకోవడమే. దానికి తోడు ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో కి అభిమానుల నుండే కాదు, ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇలా కదా ఉండాలి అని అనిపించే రేంజ్ లో ఎంతో స్టైలిష్ గా, పవర్ ఫుల్ గా డైరెక్టర్ సుజిత్ ఆ గ్లిమ్స్ వీడియో ని కట్ చేసాడు.

కేవలం గ్లిమ్స్ వీడియో తప్ప ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఎలాంటి కంటెంట్ విడుదల కాలేదు. అయినప్పటికీ కూడా ‘పుష్ప 2 ‘ తో సమానంగా, విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రంగా ‘ఓజీ’ నిల్చింది. ఇటీవలే హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోగా, త్వరలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారధ్యంలో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడు. రేపటి నుండి హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపిస్తాడని చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రూమర్ వినిపించేది. ఇది కేవలం రూమర్, అసాధ్యం అని అభిమానులు అనుకున్నారు. ఒకవేళ నిజం గా జరిగితే మాత్రం వేరే లెవెల్ ఉంటుందని, జరగాలని ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకున్నారు.

అయితే వాళ్ళ కోరిక బలంగా ఉందో ఏమో తెలియదు కానీ, ‘ఓజీ’ అని గూగుల్ లో వెతికితే, ఆ సినిమాలో క్యాస్టింగ్ వివరాల్లో ప్రభాస్ పేరు కూడా కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. నిజంగా ఈ చిత్రంలో ప్రభాస్ ఉన్నాడా?, లేదా గూగుల్ లో పొరపాటున ఆయన పేరు వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియా లో వినిపిస్తున్న మరో రూమర్ ఏమిటంటే, ఓజీ చివరి షెడ్యూల్ నవంబర్ లో జరుగుతుందని, ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు, ప్రభాస్ కూడా పాల్గొంటాడని అంటున్నారు. సోషల్ మీడియా లో వచ్చే ప్రతీ వార్తకు స్పందించే ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, ఈ వార్తపై స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ నిజంగానే ప్రభాస్ ఈ చిత్రంలో ఉంటే వసూళ్లకు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటుంది అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.