Euro Cup 2024 : ఇక ఫుట్ బాల్ పండుగ.. 24 దేశాలతో నేటి నుంచి యూరో కప్..

Euro Cup 2024 మరోవైపు జూన్ 20 నుంచి అమెరికాలో కోపా కప్ మొదలుకానుంది. అటు యూరో, ఇటు కోపా టోర్నీలతో ఒక్కసారిగా ఫుట్ బాల్ సందడి నెలకొంది.

Written By: NARESH, Updated On : June 14, 2024 9:00 pm

Euro Cup 2024

Follow us on

Euro Cup 2024 : సాకర్ తర్వాత ఫుట్ బాల్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీగా “యూరో” ఫుట్ బాల్ కప్ కు పేరుంది. ఫిఫా కప్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఈ టోర్నీని వీక్షిస్తారు.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఈ టోర్నీ మొదలవుతుంది. మ్యూనిక్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది.. ఈ కప్ కు జర్మనీ ఆతిథ్యం ఇస్తోంది.. గ్రూప్ – ఏ లో ఉన్న ఆతిధ్య జర్మనీ స్కాట్లాండ్ జట్టుతో పోటీ పడనుంది..

1960లో యూరో కప్ మొదలైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జర్మనీ, స్పెయిన్ దేశాలు చెరి మూడుసార్లు విజేతలుగా ఆవిర్భవించాయి.. ఈ టోర్నీని సోనీ స్పోర్ట్స్ (భారతదేశంలో మాత్రమే) నెట్వర్క్ లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. ప్రస్తుత యూరో కప్(17వ ఎడిషన్) జూన్ 14 నుంచి జూలై 14 వరకు జరుగుతుంది. జర్మనీలోని 10 నగరాలలో మొత్తం 51 మ్యాచులు జరుగుతాయి. ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు బరిలోకి దిగుతున్నాయి. 24 జట్లను ఆరు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ఫుట్ బాల్ సమాఖ్య నిబంధనల ప్రకారం ప్రతి గ్రూపులో ఉన్న జట్టు మిగతా టీం లతో ఒక్కో మ్యాచ్ లో తలపడుతుంది.. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచే మొత్తం 12 జట్లతో పాటు… అన్ని గ్రూపులలో కలిపి మూడవ స్థానంలో నిలిచిన నాలుగు ప్రతిభావంతమైన జట్లు రౌండ్ -16 కు వెళ్తాయి. ఇందులో గెలిచిన జట్లకు క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ పోటీలు నిర్వహిస్తారు.

ఈ టోర్నీలో ఈసారి రష్యా పోటీ పడటం లేదు. 2000 సంవత్సరం తర్వాత రష్యా లేకుండా జరుగుతున్న టోర్నీ ఇదే. ఉక్రెయిన్ పై యుద్ధం చేసిన కారణంగా క్వాలిఫై రౌండ్ లో పోటీ పడకుండా.. రష్యాపై ఫుట్ బాల్ సంఘాల కూటమి నిషేధం విధించింది. ఇక 2020లో జరగాల్సిన టోర్నీని 2021లో నిర్వహించారు. అప్పట్లో కరోనా ప్రవరణమే ఇందుకు కారణం. మరోవైపు జూన్ 20 నుంచి అమెరికాలో కోపా కప్ మొదలుకానుంది. అటు యూరో, ఇటు కోపా టోర్నీలతో ఒక్కసారిగా ఫుట్ బాల్ సందడి నెలకొంది.