https://oktelugu.com/

బ్రేకింగ్: సుశాంత్ కేసులో రియా అరెస్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో నటి రియాచక్రవర్తిని అధికారులు అరెస్ట్ చేశారు. రియాను మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు ఈరోజు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ చివరికీ డ్రగ్ కేసు వైపు మరలుతోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో పోలీసులు చేపట్టిన విచారణలో డ్రగ్ మాఫియాతో సంబంధాలు వెలుగుచూశాయి. దీంతో సీబీఐ, ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగి విచారణ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2020 / 04:46 PM IST
    Follow us on

    Riya chakravarthy

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో నటి రియాచక్రవర్తిని అధికారులు అరెస్ట్ చేశారు. రియాను మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు ఈరోజు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

    బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ చివరికీ డ్రగ్ కేసు వైపు మరలుతోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో పోలీసులు చేపట్టిన విచారణలో డ్రగ్ మాఫియాతో సంబంధాలు వెలుగుచూశాయి. దీంతో సీబీఐ, ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేస్తుండటంతో బాలీవుడ్లో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

    Also Read: రియా వెనుక బాలీవుడ్ హీరోలు?

    బాలీవుడ్ నటుడు సుశాంత్ కు రియా చక్రవర్తి ఆదేశాలతోనే డ్రగ్ ఇచ్చినట్లు ఆమె సోదరుడు విషోక్ చక్రవర్తి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. డ్రగ్ కేసులో సంబంధం ఉన్న పలువురిని ఎన్సీబీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వీరితోపాటు రియాచక్రవర్తిని సైతం పోలీసులు గత మూడురోజులుగా విచారించగా సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చిన మాట నిజమేనని అయితే తనకు డ్రగ్స్ అలవాటు లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

    డ్రగ్ సరఫరా చేస్తున్న బాసిత్ అనే వ్యక్తి తనను ఐదు సందర్భాల్లో కలిచాడని.. అతడే తమ ఇంటికి వచ్చే వెళ్లేవాడంటూ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దీంతోపాటు డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు రియా చక్రవర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. చాలామంది స్టార్ల పేర్లు విన్పిస్తుండటంతో బాలీవుడ్ కలకలం మొదలైంది. ఎప్పుడు ఎవరు అరెస్టు అవుతారననే ఆందోళనలో బాలీవుడ్ చిత్రసీమ వణుకుతోంది.

    Also Read: జక్కన్న ప్లాన్ అదుర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ ఇక జెట్ స్పీడ్?

    ఇప్పటికే రియా చక్రవర్తి ఫోన్లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రియాను కస్టడీలోకి తీసుకొన్న ఎన్పీబీ పోలీసులు వైద్యపరీక్షలు చేయించి అరెస్టు చేసేందుకు రెడీ అవుతున్నారు. రియా తెలిపిన వివరాలను ప్రకారం బాలీవుడ్ స్టార్లను ప్రశ్నించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. దీంతో డ్రగ్స్ ఉచ్చుకు బాలీవుడ్ పరిశ్రమ నిండా మునిగే అవకాశం కన్పిస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.