Prabhas Health Update: ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రభాస్…ఆయన మొదటి సినిమాతోనే మాస్ హీరోగా అవతరించాడు. ఆ తర్వాత చేసిన సినిమాలతో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ను సాధిస్తున్న ఈ స్టార్ హీరో ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు చెడిపోతుందని తను ఇటలీకి వెళ్లి మరీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇంతకీ ప్రభాస్ కి ఏమైందంటే బహుబలి సినిమా తర్వాత నుంచి ఆయన బాడీ షేప్ మొత్తం మారిపోయింది. ఆ సినిమా చేసినప్పటి నుంచే ఆయన ఆరోగ్యం కూడా బాగా చెడిపోయిందని చెబుతుంటారు.
ఎందుకంటే ఆ సినిమా కోసం హెవీగా వర్కౌట్స్ చేసి ఆ తర్వాత ఎలాంటి వర్కవుట్ చేయకుండా కొద్దిరోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకోవడం వల్ల ఆయన బాడీ మొత్తం మారిపోయిందని అందువల్లే ఆయన మళ్లీ రికవరీ అవ్వలేకపోతున్నారని చాలామంది చెబుతున్నారు.
మొత్తానికైతే ఆయన ఆరోగ్యంగానే ఉన్నప్పటికి బాడీ విషయంలో ఇంకాస్త కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన కేర్ఫుల్ గా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు.
అలాగే సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాని చేస్తున్నాడు. మొత్తానికైతే ప్రభాస్ లైనప్ ఇప్పుడు చాలా పెద్దగా ఉందనే చెప్పాలి. సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన నుంచి రాబోతున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలిస్తే ఇండియాలోనే ఆయన నెంబర్ వన్ గా మారుతాడు…