https://oktelugu.com/

Prabhas Maruthi Movie: అందుకే అతనితో ఒప్పుకున్నా.. ప్రభాస్ ఫుల్ క్లారిటీ !

Prabhas Maruthi Movie: పాన్ ఇండియా హీరోల లిస్ట్ లోకి ఎంత మంది హీరోలు వచ్చి చేరినా.. నెంబర్ వన్ ‘పాన్ ఇండియా హీరో’ అంటే ప్రభాస్ ఒక్కడే. స్టార్ డమ్ లోనే కాదు, మార్కెట్ పరంగా కూడా ప్రభాస్ కి తిరుగులేదు. ఆ స్థాయిలోనే ఆ విధంగానే ప్రభాస్ కూడా భారీ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నాడు. కానీ, ఈ మధ్యలోనే దర్శకుడు మారుతి ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడనే వార్త.. ఫ్యాన్స్ ను చాలా ఇబ్బంది […]

Written By:
  • Shiva
  • , Updated On : April 19, 2022 / 01:38 PM IST
    Follow us on

    Prabhas Maruthi Movie: పాన్ ఇండియా హీరోల లిస్ట్ లోకి ఎంత మంది హీరోలు వచ్చి చేరినా.. నెంబర్ వన్ ‘పాన్ ఇండియా హీరో’ అంటే ప్రభాస్ ఒక్కడే. స్టార్ డమ్ లోనే కాదు, మార్కెట్ పరంగా కూడా ప్రభాస్ కి తిరుగులేదు. ఆ స్థాయిలోనే ఆ విధంగానే ప్రభాస్ కూడా భారీ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నాడు. కానీ, ఈ మధ్యలోనే దర్శకుడు మారుతి ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడనే వార్త.. ఫ్యాన్స్ ను చాలా ఇబ్బంది పెట్టింది, చాలా భయపెట్టింది కూడా.

    Prabhas Maruthi Movie

    ఇదొక రూమర్ అని ప్రభాస్ ఫ్యాన్స్ మొదట్లో దీన్ని నమ్మలేదు. ఇలాంటి అనుమాన పరిణామ క్రమంలో ఈ వార్త నిజమే అని మారుతి ఇన్ డైరెక్ట్ గా క్లూ ఇచ్చాడు. ప్రభాస్ ఓన్ సంస్థ లాంటి యువీ క్రియేషన్స్ కూడా నిజమే అన్నట్టు క్లారిటీ ఇచ్చింది. అసలు ప్రభాస్, మారుతికి సినిమా ఎందుకు ఇస్తున్నాడు ?

    Also Read: Chiranjeevi-Mahesh Babu: షాకింగ్ : బాధపడుతూ మెసేజ్ లు చేసిన మహేష్ – చిరంజీవి !

    చిన్న చిన్న సినిమాలు చేసే మారుతి, ఇంతకీ పాన్ ఇండియా రేంజ్ సినిమాని మ్యానేజ్ చేయగలడా ? వెంకటేష్ లాంటి సీనియర్ హీరో ఇమేజ్ నే మ్యానేజ్ చేయలేక చేతులెత్తేసిన మారుతి.. ఇక ప్రభాస్ ఇమేజ్ ను ఎలా హ్యాండిల్ చేయగలడు ? మొత్తానికి ఇలాంటి అనేక అపోహల మధ్య ప్రభాస్ అభిమానులను ఈ వార్త ఇంకా బాగా టెన్షన్ పెట్టింది.

    తన అభిమానుల టెన్షన్ ను గమనించిన ప్రభాస్.. మొత్తానికి ఈ సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలు అన్నీ పూర్తి యాక్షన్ మూవీసే అని, వీటి మధ్య ఓ విభిన్నమైన కామెడీ చిత్రం చేయాలని ఉద్దేశ్యంతోనే తాను మారుతికి సినిమా ఇచ్చినట్టు ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

    Prabhas Maruthi Movie

    మొత్తమ్మీద పక్కా ప్లాన్‌ ప్రకారమే ప్రభాస్‌.. మారుతి కథకు ఓకే చెప్పాడు. ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. 2024 సంక్రాంతికి ‘మారుతి – ప్రభాస్’ సినిమా రిలీజ్ కానుంది.

    Also Read:Pavan Kalyan Movie Title: పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో విజయ్ దేవరకొండ సినిమా

    Recommended Videos:

    Tags