Shocking News Anakapalle: అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు అంటే ఏంటో అనుకున్నాం.. కానీ మర్డర్లు కూడా చేసి మేం తక్కువేం కాదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అక్రమ సంబందం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడం… ఓ అబ్బాయి వేధిస్తున్నాడని కొందరు.. ప్రేమించలేదని కొందరు.. ప్రేమిస్తున్నారని కొందరు ఇలా రోజు దేశవ్యాప్తంగా ఎన్నో ఘటనలు చూస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఇందుకు మినహాయింపేం కాదు. ఇలాంటి ఘటనలు చాలనే జరుగుతాయి. కొన్ని వెలుగు లోకి వస్తాయి.. మరికొన్ని అక్కడే సద్దుమణిగిపోతాయి. నిత్యం ఎక్కడో ఒక చోటా ఇలాంటివి వార్తల్లో వింటూనే ఉంటాం. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే సంచలనం రేపుతోంది.
Shocking News Anakapalle
కాబోయే భర్తకు ఓ అమ్మాయి సర్ప్రైజ్ అని చెప్పి రమ్మని కళ్లు మూసుకొమ్మని కత్తితో గొంతులో పొడిచిన ఘటన మండలం బుచ్చెయ్యపేట మండలం అమరపురి వద్ద జరిగింది. ఈ సంఘటన ప్రస్తుతం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. రావికమతం గ్రామానికి చెందిన 22 సంవత్సరాల వియ్యపు పుష్పకు, మాడుగుల మండలం ఎంకే వల్లాపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల అద్దేపల్లి రామానాయుడుతో వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. రామానాయుడు హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ లో పరిశోధకుడిగా పని చేస్తున్నాడు.
Also Read: CM KCR- National Politics: కల చెదిరే.. ఒంటరిగా మిగిలిపోయిన కేసీఆర్!?
అయితే పెళ్లి ఇష్టం లేని పుష్పా పెద్దలతో చెప్పకుండా ఓ ప్లాన్ వేసింది. కాబోయే భర్తనే మర్డర్ చేస్తే పెళ్లి ఆగిపోతుందిని నిశ్చయించుకుంది. రామానాయుడిని సర్ప్రైజ్ ఉందని చెప్పి ఫోన్ చేసి బుచ్చయ్యపేట మండలం కొమ్మలపూడి వద్ద గల అమరపురి సమీపంలో కలుసుకుందామని చెప్పింది. పాపం విషయం తెలియక రామానాయుడు అక్కడికి చేరుకున్నాడు. రాగానే సర్ప్రైజ్ ఇస్తానని కళ్లుముసుకోమని చెప్పింది. రామానాయుడు కళ్లుమూసుకోగానే వెంంట తెచ్చుకున్న కత్తితో వెంటనే రామానాయుడు గొంతులో పొడిచింది.
Shocking News Anakapalle
రక్తస్రావంతో పడి ఉన్న రామానాయుడును గమనించిన స్థానికులు అతడిని రావికమతం పీహెచ్సీకి తరలించారు. ఆ తర్వాత ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామానాయుడు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబోయే భర్త గొంతు కోసి పరారైన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నటు సమాచారం.
Also Read:Pragathi: లేటు వయసులో ఘాటు అందాలు.. ప్రగతి బర్త్‌డే ఫోజులు చూస్తే మతి పోవాల్సిందే..
Recommended Videos