Prabhas Fauji: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన హీరోలందరు పాన్ ఇండియాలో తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ లాంటి నటుడు సైతం పాన్ ఇండియాలో తన సత్తా చాటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు.
ఇక రీసెంట్గా ఆయన ఫౌజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు అక్కడ ఆయనకి ఒక చెడు అనుభవమైతే ఎదురైందట. దానివల్ల ఆయన సినిమా షూటింగ్ నుంచి వెళ్లిపోయారట… కారణం ఏంటి అంటే అక్కడున్న డైరెక్షన్ టీం ప్రభాస్ ని సరిగ్గా చూసుకోలేదని ఆయన వచ్చినా కూడా సినిమా షూటింగ్ లేట్ అయిపోతూ ఉండటం వల్లే ఆయన వెళ్లిపోయాడు అంటు కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఆ తర్వాత మళ్లీ ప్రభాస్ తనంతట తానే షూటింగ్ కి వచ్చి షూటింగ్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక ఏది ఏమైనా కూడా ఫౌజీ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ పోస్టర్ కానీ, గ్లింప్స్ కానీ రిలీజ్ కాలేదు… ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో కూడా సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
మరి ప్రభాస్ లాంటి నటుడు ఈ సంవత్సరం రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించకపోవడంతో తన అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యకం చేస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రభాస్ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే తొందరగా సినిమాలను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ఐతే ఉన్నాడు…