తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఎప్పుడైతే ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా చేశాడో అప్పటినుంచి పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవల్ కి వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నే నెంబర్ వన్ ఇండస్ట్రీగా కొనసాగుతుంది. మరి దీనిని బీట్ చేసేవారు ఎవరు లేకపోవడంతో మళ్లీ మనవాళ్లు క్రియేట్ చేసిన రికార్డులను మనవాళ్లే తిరగరాస్తున్నారు… ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న ప్రభాస్ సైతం పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు. ఈ సంవత్సరం రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
దాంతో హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమాని సైతం ఇయర్ లోనే రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ గాని, టీజర్ గానీ ఇంకా ఏది రిలీజ్ చేయలేదు. తొందర్లోనే ఈ సినిమా నుంచి ఒక టీజర్ రాబోతుందంటు సినిమా మేకర్స్ చెబుతున్నారు…ఈ టీజర్ లో ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడట.
ఆ లుక్ ను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతారు అంటూ దర్శకుడు చెబుతుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ప్రభాస్ ని మనం ఆర్మీ ఆఫీసర్ గా అయితే చూడలేదు . ఇక హను రాఘవపూడి ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్ ని వైవిధ్యంగా ప్రజెంట్ చేయబోతున్నాడట…
ఆ లుక్ ని చూడ్డానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘శ్రీరామనవమి’ కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ అయితే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు…ఇక అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాని ఈ సంవత్సరం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు…