Nandamuri Balakrishna : నందమూరి తారక రామారావు ఓ లెజెండ్. సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని హీరోగా వెలుగొందారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, యముడు, రావణాసురుడు వంటి పాత్రలకు ఆయన ఐకానిక్ గా నిలిచారు. ట్రెండ్ సెట్ చేశారు. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్ అధికారం చేపట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ రథయాత్ర చేశారు.
అప్పటికే ఎన్టీఆర్ వయసు అరవై ఏళ్ళు దాటాయి. రోజంతా ప్రచారం చేసి, వివిధ ప్రాంతాల్లో బస చేసేవారు. ఎన్టీఆర్ చాలా ఫిట్ గా ఉండేవారు. ఆయన ఆజాను బాహుడు. కొంచెం బొజ్జ కనిపించినప్పటికీ అది ఆయన శరీర తత్త్వం. ఎన్టీఆర్ కి మరణించే వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదట. ఈ విషయాన్ని ఓ టాక్ షోలో బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు.
ఆ రోజుల్లో వ్యాయామం అంటే ఏదో ఒక పని చేయడం. జిమ్స్ ఉండేవి కావు. వ్యాయామం మీద ఆవాహన ఉన్నవాళ్లు కూడా తక్కువే. అందుకే ఎన్టీఆర్ తెల్లవారు జామునే లేచి ఇసుకను అక్కడి నుండి ఇక్కడికి ఇక్కడి నుండి అక్కడికి చేరవేసేవాడట. అదే ఆయన వ్యాయామం అట. జ్వరం వస్తే ఎన్టీఆర్ టాబ్లెట్ వేసుకునేవాడు కాదట. అందుకు ఆయన ఒక విధానం పాంటించేవాడట.
నాటు కోడికి బాగా కారం, ఉప్పు దట్టించి కాల్చి… కోడి మొత్తం తినేసేవాడట. ఆ ఘాటైన నాటు కోడి మాంసం తిని దుప్పటి కప్పుకుని పడుకునేవాడట. తెల్లారే సరికి దుప్పటి మొత్తం ఆయన చెమటకు తడిసిపోయేదట. జ్వరం తగ్గిపోయేదట. ఈ విధానం నువ్వు కూడా పాటించని బాలయ్యకు ఎప్పుడైనా జ్వరం వస్తే వాళ్ళ సిస్టర్ చెప్పేవారట. అమ్మో నా వల్ల కాదని బాలకృష్ణ అనేవారట. అసలు జ్వరం వస్తే నాన్ వెజ్ తినకూడదని డాక్టర్స్ సూచిస్తారు. మరి ఎన్టీఆర్ దానికి వ్యతిరేకంగా నాటి కోడి మాంసం తిని జ్వరాన్ని తరిమేసేవారట.
తెల్లవారుజామున బ్రేక్ పాస్ట్ గా కూడా ఎన్టీఆర్ నాటు కోడి మాంసం తినేవాడని అందరూ అంటారు. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకున్నాడు. అది ఆయన మీద కుటుంబ సభ్యుల వ్యతిరేకతకు కారణమైంది. 1996 జనవరి 18న 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ గుండెపోటుతో కన్నుమూశారు.