Project K
Project K : ప్రాజెక్ట్ కే టీమ్ తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది పెద్ద స్కామ్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రాజెక్ట్ కే ప్రమోషన్స్ లో భాగంగా యూనిట్ ఉచిత టీషర్ట్స్ ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. వైజయంతి మూవీస్ అధికారిక ట్విట్టర్ లో ఒక లింక్ పోస్ట్ చేశారు. నిర్దేశిత సమయంలో లింక్ ఓపెన్ చేసి ‘వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే?’ అని రాసి ఉన్న టీ షర్ట్ ఆర్డర్ చేసుకోవచ్చని తెలియజేశారు. ఇప్పటికి మూడుసార్లు టీ షర్ట్స్ డ్రాప్ చేశారు.
మూడుసార్లు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. లింక్ క్లిక్ చేస్తే ఎర్రర్ అని వస్తుంది. రెండు మూడు నిమిషాల తర్వాత స్టాక్ ఓవర్, మీరు టీ షర్ట్ కోల్పోయారంటూ మెసేజ్ వస్తుంది. ఇలా ఒకరిద్దరికి కాదు చాలామందికి సైట్ ఎర్రర్ అని చూపిస్తుంది. అసలు వెబ్ సైట్ ఓపెన్ కాకుండా స్టాక్ అయిపోవడమేంటని ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్కామ్, చీటింగ్, ప్రమోషన్స్ కోసం మోసం చేస్తున్నారని కామెంట్స్ సెక్షన్ లో తెలియజేస్తున్నారు.
ప్రతి డ్రాప్ కి ఎన్ని టీ షర్ట్స్ అందుబాటులోకి చేస్తున్నారో తెలియదు. ఆన్లైన్ వ్యవహారం కావడంతో ఉచిత టీ షర్ట్స్ అనే ఈ స్కీమ్ లో ట్రాన్స్పరెన్సీ లేదు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూస్తుంటే వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే? ఫ్రీ టీ షర్ట్స్ స్టంట్ బ్యాక్ ఫైర్ అయినట్లుగా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ లో నెగిటివిటీకి కారణమైంది.
కాగా ప్రాజెక్ట్ కే టీమ్ శాన్ డియాగో కామిక్ కామ్ 2023 ఈవెంట్లో పాల్గొననుంది. ఈ గ్లోబల్ ఈవెంట్ సాక్షిగా ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ రివీల్ చేయనున్నట్లు సమాచారం అందుతుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే విడుదల కానుంది. ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తుంది. దిశా పటాని కీలక రోల్ చేస్తున్నారు. కమల్ హాసన్ భాగం కావడం కీలక పరిణామం. అమితాబ్ సైతం నటిస్తున్న విషయం తెలిసిందే.
Thank you for the BLASTing response for 'The Rise' 💥💥💥
After multiple Krashes all stock claimed in 4 minutes.#ProjectK #WhatisProjectK pic.twitter.com/QBPg4JpE6v— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 10, 2023