Director Maruti Vs Prabhas Fans : దర్శకుడు మారుతి తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దర్శకుడు మారుతి వేసిన ట్వీట్ ఇందుకు కారణమైంది. విషయంలోకి వెళితే… దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ మూవీ ఊహించని విజయం సాధించింది. ఈ చిత్ర వసూళ్లు రూ. 50 కోట్లు దాటేశాయి. ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించారు. అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరయ్యారు. చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. బేబీ చిత్ర నిర్మాత ఎస్కెఎన్ కావడంతో ఆయన ప్రత్యేకంగా రావడం జరిగింది.
సాయి రాజేష్, ఎస్కేఎన్ సన్నిహితుడైన దర్శకుడు మారుతి కూడా ఈ ఈవెంట్ కి వచ్చాడు. బేబీ చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న అల్లు అర్జున్ ని పొగుడుతూ మారుతి ట్వీట్ చేశారు. కాగా జులై 20న ప్రభాస్ మూవీ కల్కి 2898 AD టీజర్ విడుదలైంది. చిత్ర ప్రముఖుల్లో చాలా మంది కల్కి టీజర్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. తమ అధికారిక అకౌంట్స్ లో ప్రమోట్ చేశారు. ప్రభాస్ తో పాటు కల్కి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.
ప్రభాస్ తో మూవీ చేస్తున్న మారుతి మాత్రం అసలు స్పందించలేదు. కల్కి టీజర్ పై ట్వీట్ చేయని మారుతి బేబీ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న అల్లు అర్జున్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం, ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. ప్రభాస్ వంటి పెద్ద హీరో నీకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ. నువ్వు కల్కి టీజర్ గురించి ఒక్క చిన్న ట్వీట్ వేయలేకపోయావ్. అల్లు అర్జున్ ని పొగడుతూ మాత్రం ట్వీట్ వేస్తావా అని మండిపడుతున్నారు.
ఇప్పుడే ఈ వివాదం రాజుకోగా అది వ్యాపించే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా మారుతి-ప్రభాస్ కాంబోలో హారర్ కామెడీ చిత్రం తెరకెక్కుతుంది. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కొంత మేర షూటింగ్ జరుపుకుంది. మారుతితో మూవీ చేయవద్దని అప్పట్లో ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. ప్రభాస్ ఎందుకో మారుతిని నమ్మారు. అసలు ప్రభాస్ ఇమేజ్ కి హారర్ కామెడీ మూవీ చేయడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.