https://oktelugu.com/

Custody Collections : ‘కస్టడీ’ 2 రోజుల వసూళ్లు ‘ఏజెంట్’ మొదటి రోజు వసూళ్లకంటే తక్కువనా..? పాపం నాగచైతన్య!

వరకు బిజినెస్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రం కి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తే 15 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : May 14, 2023 / 08:37 AM IST
    Follow us on

    Custody Collections : అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడిన సంగతి తెలిసిందే. మొదటి రోజే ఈ చిత్రానికి మేజర్ సిటీలలో మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీలు దారుణంగా వచ్చాయి. ఆ తర్వాత డివైడ్ టాక్ రావడం తో మ్యాట్నీ షోస్ నుండి ఎవ్వరూ ఊహించని రీతిలో డ్రాప్స్ పడ్డాయి.

    అలా ప్రతి షో కి ముందు షోతో పోలిస్తే 50 శాతం కి పైగా వసూళ్లు తగ్గుతూ వచ్చింది.అలా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కేవలం నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ రెండు కోట్ల రూపాయిల లోపే ఉంటుందని అంచనా,ఇక రెండవ రోజు అయితే షేర్ వసూళ్లు మిగలడం  చాలా కష్టం అయ్యింది. కొన్ని ప్రాంతాలలో ఉన్న థియేటర్స్ కి డే డెఫిసిట్స్ పడ్డాయి.

    అలా రెండు రోజులకు కలిపి ఈ సినిమాకి వచ్చిన షేర్ మూడు కోట్ల రూపాయిల కంటే తక్కువే ఉంటుంది. అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ డిజాస్టర్ చిత్రం ‘ఏజెంట్’ కి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నాగ చైతన్య కస్టడీ కి రెండు రోజులకు కలిపి కూడా అంత రాకపోవడం విశేషం.

    దీనిని బట్టీ అర్థం అవుతుంది ఏమిటంటే జనాల్లో నాగ చైతన్య కంటే అఖిల్ కి ఎక్కువ క్రేజ్ ఉందని. ఇక కస్టడీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే టీజర్ మరియు ట్రైలర్ ఆసక్తికరంగా ఉండేలోపు 22 కోట్ల రూపాయిల వరకు బిజినెస్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రం కి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తే 15 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ చిత్రం ఎంతవరకు లాగుతుందో చూడాలి.