spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas: ప్రభాస్ కి ఆ ఇద్దరు స్టార్ హీరోలంటే ఎందుకు పడదు..?

Prabhas: ప్రభాస్ కి ఆ ఇద్దరు స్టార్ హీరోలంటే ఎందుకు పడదు..?

Prabhas: ‘ఈశ్వర్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ చాలా తక్కువ సమయంలోనే యంగ్ రెబల్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. కృష్ణంరాజు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన ఎక్కడ తగ్గకుండా ప్రేక్షకులను మైమరిపింపజేయడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఇక తన కటౌట్ కి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను సైతం చాలా సక్సెస్ ఫుల్ గా డీల్ చేస్తూ ప్రేక్షకులందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేలా చేస్తున్నాడు. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. హను రాఘవపూడి దర్శకత్వం లో చేసిన ఫౌజీ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సంవత్సరం ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ కి ఒక ఇద్దరు హీరోల సినిమాలంటే నవ్వే కాదట. ఆ సినిమాలను చూసి విసిగిపోయాడట. ప్రభాస్ తన చిన్నతనంలో ఉన్నప్పుడు హీరో రాజశేఖర్ చేసే సెంటిమెంటల్ సినిమాలను చూసి ఆయన ఎమోషన్ కి గురయ్యేవారట. ఇక రాజశేఖర్ తో పాటుగా తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న భాగ్యరాజ్ సినిమాలు కూడా అతనికి పెద్దగా నచ్చవి కాదట.

ఎందుకంటే ఇందులో మెలో డ్రామా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సినిమా చూస్తున్నపుడు ప్రభాస్ ఆ ఎమోషనల్ సన్నివేశాలకు ఎక్కువగా కనెక్ట్ అయిపోయాడట. ఆ సినిమాలు చూసినప్పుడు ఏదో ఒక తెలియని లో ఫీల్ అయితే కలిగేదట. అందువల్లే వీళ్ళ సినిమాలను చూడడం తగ్గించారట.

ఇక ఆ హీరోలు సినిమాలు వస్తున్నాయి అంటే కూడా ప్రభాస్ కి వాటిని చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయిందట. అందుకే ఆ హీరోలంటే తనకు పెద్దగా నచ్చాదట. ఇక రాజశేఖర్ చెందిన కొన్ని పవర్ ఫుల్ సినిమాలను ప్రభాస్ చూసేవాడట. కేవలం ఎమోషనల్ సినిమాలను మాత్రమే స్కిప్ చేసేవాడట… మొత్తానికైతే ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ కి మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండే సినిమాలు అంటే బాగా నచ్చుతాయట. వాటి కోసమే ఆయన ఎక్కువగా సమయాన్ని కేటాయించి మరి ఆ సినిమాలను చూడడానికి ఇష్టపడుతు ఉండేవారట. ముఖ్యంగా వల్ల పెదనాన్న కృష్ణం రాజు సినిమాలతో పాటు చిరంజీవి, బాలయ్య బాబు సినిమాలు చాలా ఎక్కువగా చూసేవాడట..

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular