Prabhas: ఊరికే సూపర్ స్టార్స్ అయిపోరు. గొప్ప టాలెంట్ తో పాటు మంచి మనసు వారిని హీరోలుగా తీర్చిదిద్దుతుంది. జనాల్లో దేవుళ్లను చేస్తుంది. కాగా హీరో ప్రభాస్ తన అభిమాని కోసం చేసిన పని తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. కన్నయ్య అలియాస్ రంజిత్ కి ప్రభాస్ అంటే వల్లమాలిని అభిమానం. రంజిత్ అనుకోకుండా అరుదైన క్యాన్సర్ బారినపడ్డాడు. అతన్ని ప్రపంచంలోని ఏ వైద్యం బ్రతికించలేదు. దాంతో పేరెంట్స్ అతని చివరి కోరికలు తీర్చాలని డిసైడ్ అయ్యారు. ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లారు. కాగా నాకు ప్రభాస్ అంటే ప్రాణం ఆయన్ని కలిసే ఏర్పాటు చేయాలని కోరాడట.
పూరి జగన్నాథ్ భార్య లావణ్యతో ఆ కుటుంబానికి పరిచయం ఉందట. ఆమెకు తన కొడుకు కోరిక గురించి చెప్పగా… ఆమె పూరి జగన్నాధ్ కి చెప్పి ప్రభాస్ కి విషయం చేరవేశారట. ప్రభాస్ వెంటనే కలిసే ఏర్పాట్లు చేయమన్నాడట. అలాగే తాను నటించిన బాహుబలి మూవీలో ఉపయోగించిన కత్తిని అభిమానికి గిఫ్ట్ గా ఇచ్చాడట. అలాగే అభిమాని ఇచ్చిన బహుమతిని స్వీకరించాడట.
సదరు అభిమానికి ఇష్టమైన వంటకాలతో విందు ఏర్పాటు చేశాడట. అరగంటకు పైగా ముచ్చటించాడట. ప్రభాస్ ని కేవలం కలిస్తే చాలు అనుకున్న అభిమాని రంజిత్ కి ఊహించని ఆతిధ్యం లభించింది. ప్రభాస్ ని కలిసిన కొద్దిరోజుల తర్వాత రంజిత్ చనిపోయాడు. వాళ్ళ అమ్మ కొడుకు జ్ఞాపకార్థం ఇంటి ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసిందట. చివరి రోజుల్లో ఉన్న అభిమాని పట్ల ప్రభాస్ వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంటుంది.
ప్రభాస్ కి అందుకే పరిశ్రమలో భోళా శంకరుడు అనే పేరుంది. ఆయన సెట్స్ లో కూడా అందరికీ మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తారు. తోటి నటులకు అయితే అరుదైన వంటకాలతో విందు ఏర్పాటు చేస్తారు. ప్రభాస్ తో పని చేసిన చాలా మంది హీరోయిన్స్ ఈ విషయంలో ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ లో కూడా నాలుగు వందల కోట్ల వసూళ్లు రాబట్టింది.