NTR-Prabhas : ఎన్టీఆర్-ప్రభాస్ సమకాలీన నటులు. దాదాపు ఒకే సమయంలో పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోగా ఎన్టీఆర్ డెబ్యూ మూవీ నిన్ను చూడాలని 2001లో విడుదలైంది. 2002లో విడుదలైన ఈశ్వర్ చిత్రంతో ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఇద్దరూ స్టార్ హీరోలుగా ఎదిగారు. పాన్ ఇండియా స్టార్స్ కూడాను. బాహుబలి, బాహుబలి 2, సాహో, కల్కి 2898 AD నార్త్ లో సత్తా చాటాయి. అలాగే ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా హిట్.
ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ రాజమౌళి ఖాతాలో వేశారు. దేవరతో ఎన్టీఆర్ తనకు నార్త్ లో మార్కెట్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. దేవర హిందీ వెర్షన్ రూ. 60 కోట్ల మార్క్ కి చేరువైంది. కాబట్టి ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అనడంలో సందేహం లేదు. కాగా ఎన్టీఆర్, ప్రభాస్ మధ్య మనస్పర్థలు ఉన్నాయనే ఓ వాదన ఉంది. అసలు వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భం లేదు. ఈ మధ్య కాలంలో ప్రభాస్, ఎన్టీఆర్ అసలు కలవలేదు.
చివరిగా ప్రభాస్-ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహంలో కలిశారు. ఇక ప్రభాస్, ఎన్టీఆర్ ఒకరంటే మరొకరికి పడదు అనే వార్తల్లో కూడా నిజం లేదట. ప్రైవేట్ గా వీరు మాట్లాడుకుంటారట. ప్రభాస్ ఇచ్చే లగ్జరీ పార్టీలకు ఎన్టీఆర్ హాజరవుతారట. ఒకరి సినిమా విడుదలైనప్పుడు మరొకరు కాల్ చేసి విష్ చేసుకుంటారట.
కాగా గతంలో ప్రభాస్ ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రం తనకు నచ్చలేదని ఓపెన్ గా చెప్పాడు. ప్రభాస్ మాట్లాడుతూ.. మీరు ఏమీ అనుకోవద్దు. ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ నాకు నచ్చలేదు. తర్వాత సింహాద్రి రిలీజ్ అయ్యింది. అప్పుడు నేను వర్షం మూవీలో నటిస్తున్నాను. ఆ చిత్రం సెట్స్ పై ఉంది. సింహాద్రి చిత్రం బ్లాక్ బస్టర్ అని అందరూ చెప్పుకుంటున్నారు.
తారక్ నన్ను మూవీ చూద్దాం రమ్మని ఆహ్వానించాడు. నేను వెళ్ళాను. సింహాద్రి మూవీ చూస్తుంటే నాకు మెంటల్ ఎక్కేసింది. స్టూడెంట్ నెంబర్ వన్ తీసిన దర్శకుడేనా ఈ మూవీ తెరకెక్కించింది. ఇలాంటి దర్శకుడితో ఒక్క సినిమా అయినా చేయాలని, అనుకున్నాను.. అని అన్నారు. కాగా సింహాద్రి దర్శకుడు రాజమౌళితో ప్రభాస్ ఏకంగా 3 సినిమాలు చేశాడు.
ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ చేశాడు. ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాలుగా ఇవి ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ తో రాజమౌళి అత్యధికంగా 4 సినిమాలు చేశాడు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి.