https://oktelugu.com/

‘సలార్’గా రాబోతున్న ప్రభాస్.. ఫ్యాన్స్ ఖుషీ..!

‘బాహుబలి’ సిరీసుల తర్వాత యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ రేంజ్ వరల్డ్ వైడ్ గా మారింది. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీ తర్వాత తెరకెక్కిన ‘సాహో’ సైతం ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ గా నిరూపించింది. సాహో మూవీ ఉత్తరాది ప్రేక్షకులను బాగా కనెక్ట్ అవడంతో బాలీవుడ్లో ప్రభాస్ కు యాక్షన్ హీరోగా క్రేజ్ దక్కింది. Also Read: వైరల్ అవుతోన్న పవన్ ఫ్యామిలీ ఫోటో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 2, 2020 / 07:11 PM IST
    Follow us on

    ‘బాహుబలి’ సిరీసుల తర్వాత యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ రేంజ్ వరల్డ్ వైడ్ గా మారింది. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీ తర్వాత తెరకెక్కిన ‘సాహో’ సైతం ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ గా నిరూపించింది. సాహో మూవీ ఉత్తరాది ప్రేక్షకులను బాగా కనెక్ట్ అవడంతో బాలీవుడ్లో ప్రభాస్ కు యాక్షన్ హీరోగా క్రేజ్ దక్కింది.

    Also Read: వైరల్ అవుతోన్న పవన్ ఫ్యామిలీ ఫోటో !

    సాహో తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓంరావత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా ప్రభాస్-కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ వస్తుందని ప్రచారం జరిగింది.

    వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్టేడ్ తాజాగా రిలీజైంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ‘సలార్’గా చిత్రయూనిట్ ప్రకటించింది. ది మోస్ట్ వైలెంటెడ్ మ్యాన్..కాల్డ్ వన్ మ్యాన్.. ది మోస్ట్ వైలెంట్.. అంటూ రిలీజైన ‘సలార్’ పోస్టర్లో ప్రభాస్ తుపాకీ మీద చేయిపెట్టి చాలా వైలెంట్ గా కన్పిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే పక్కా మాస్ ఎంటటైనర్ గా రాబోతుందని అర్థమవుతోంది.

    Also Read: అల్లు అర్జున్ కి మరో ఘనత.. టాప్ క్రేజీ పీపుల్ లిస్ట్ !

    కేజీఎఫ్ మూవీని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థనే ‘సలార్’ మూవీని నిర్మిస్తుంది. ఈ మూవీని ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులను ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తుంది. అయితే ఈ మూవీ కన్నడలో సూపర్ హిట్టుగా నిలిచి ‘ఉగ్రమ్’ మూవీకి రీమేక్ అనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం. ప్రభాస్ కు సంబంధించి క్రేజ్ అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్