
ఎమ్మెల్సీ కవిత త్వరలోనే మంత్రి కానున్నారా అంటే.. అవుననే సంకేతాలు ఆమె నుంచి వినిపిస్తున్నాయి. ఈరోజు కరీంగనర్‌లో విలేకర్లతో చిట్‌చాట్ నిర్వహించిన ఆమె, దీనికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ”నూతన సంవత్సరంలో మంత్రి వర్గంలో మీరు ఉండబోతున్నారా?” అని విలేకర్లు ప్రశ్నించగా ”ఉగాది వరకు చాలా సమయం ఉంది. అప్పటిదాకా ఆగాలా?” అని ఎదురు ప్రశ్నించారు. ”మరి సంక్రాంతికి ముందేనా?” అంటూ మరో ప్రశ్న అడగ్గా.. నవ్వుతూ సైగ చేశారు.