https://oktelugu.com/

Samantha  : రోజులు లెక్కపెట్టుకో అంటూ శోభిత దూళిపాళ్ల పై సమంత సంచలన పోస్ట్..అసలు ఏమైందంటే!

శోభిత దూళిపాళ్ల తన ఇంటి వద్ద పెళ్లి కి ముందు జరిగే శుభ కార్యాల్లో పాల్గొంటూ, వాటికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. ఈమధ్య కాలంలో హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ పెళ్లి జరుపుకుంటున్న జంట బహుశా నాగ చైతన్య, శోభితలే అనుకుంట.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 01:48 PM IST

    Samantha

    Follow us on

    Samantha  :  ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల జంటకు సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి. గత కొంత కాలం గా సీక్రెట్ డేటింగ్ చేసుకుంటూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు ఆగస్టు 8వ తారీఖున నిశ్చితార్థం చేసుకున్నారు. వీళ్ళ నిశ్చితార్దానికి ముందు ఎలాంటి ప్రకటన చేయలేదు. రేపు నిశ్చితార్థం అనగా, ఈరోజు సాయంత్రం అభిమానులకు తెలిసింది. అంత సైలెంట్ గా ఈ శుభకార్యాన్ని జరిపించారు. ప్రస్తుతం వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. శోభిత దూళిపాళ్ల తన ఇంటి వద్ద పెళ్లి కి ముందు జరిగే శుభ కార్యాల్లో పాల్గొంటూ, వాటికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. ఈమధ్య కాలంలో హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ పెళ్లి జరుపుకుంటున్న జంట బహుశా నాగ చైతన్య, శోభితలే అనుకుంట.

    అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీళ్లిద్దరి పెళ్లి డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే చేయనుంది అక్కినేని ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా శోభిత కి సమంత అనే సోదరి ఉంది. ఈమె సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది. తన అక్క పెళ్ళికి సందడి మొత్తం ఈమెదే. సోషల్ మీడియా లో ఈమె తన అక్క పెళ్లి సంబరాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె తన అక్క, తల్లిదండ్రులతో కలిసి ఒక ఫోటో ని అప్లోడ్ చేసింది. దాని క్రింద ‘కౌంట్ డౌన్ బిగిన్స్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలకు సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్ట్ క్రింద అక్కినేని అభిమానులు తొందరగా పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘తండేల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై సుమారుగా 70 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దామని ముందుగా అనుకున్నారు కానీ, అప్పటికి వర్క్ పూర్తి అయ్యే అవకాశం లేకపోవడంతో ఫిబ్రవరి 7వ తేదికి వాయిదా వేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లకు, గ్లిమ్స్ వీడియోలకు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ లేకుండా ఇబ్బంది పడుతున్న అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ఈ సినిమా విజయం సాధించడం చాలా అవసరం.