https://oktelugu.com/

Prabhas: షారుఖ్ ఖాన్ రికార్డ్ ను బ్రేక్ చేసిన ప్రభాస్… బాలీవుడ్ వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ…

Prabhas: బాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్న ఖాన్ త్రయం వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను తీయలేకపోతున్నారు. దానివల్ల బాలీవుడ్ జనాలు సౌత్ సినిమా ఇండస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ ని పెట్టి...

Written By:
  • Gopi
  • , Updated On : July 2, 2024 / 11:49 AM IST

    Prabhas broke Shah Rukh Khan record

    Follow us on

    Prabhas: సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కల్కి సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలో ప్రభాస్ షారుక్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టి మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి బాలీవుడ్ స్టార్ హీరోలైన ఖాన్ త్రయం సినిమాలు గత కొన్ని సంవత్సరాల నుంచి సరైన ఆదరణను పొందలేకపోతున్నాయి.

    అయినప్పటికీ బాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్న ఖాన్ త్రయం వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను తీయలేకపోతున్నారు. దానివల్ల బాలీవుడ్ జనాలు సౌత్ సినిమా ఇండస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ ని పెట్టి మన సినిమాలనే ఎక్కువ చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ప్రధానంగా మన సినిమాలు గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమాలు గా రావడంతో వాళ్ళు చాలా వరకు సక్సెస్ ను అయితే పొందుతున్నారు.

    ఇక మొత్తానికైతే షారుక్ ఖాన్ గత చిత్రాలు అయిన జవాన్, పఠాన్ రెండు సినిమాలు కూడా 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న హీరోల్లో షారుక్ ఖాన్ కొంతవరకు ఓకే అనిపించుకున్నాడు. అయితే ఈయన చేసిన జవాన్ సినిమా మొదటి రోజు 125 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అలాగే పఠాన్ 106 కోట్లను రాబట్టింది. ఇలాంటి సమయంలో కల్కి సినిమా మొదటి రోజు 190 కోట్ల కలెక్షన్లను రాబట్టి మొదటిరోజు షారుక్ ఖాన్ పేరు మీద ఉన్న రికార్డును మరోసారి బ్రేక్ చేసింది. ఇక దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీ కి మనవాళ్ళు దెబ్బ దెబ్బ కొడుతున్నారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తన రికార్డ్ ను మాత్రం తను బ్రేక్ చేసుకోలేకపోయాడు.

    బాహుబలి 2 సినిమా మొదటి రోజు 217 కోట్లను వసూలు చేసింది. ఇక ఈ రికార్డును మాత్రం ప్రభాస్ బ్రేక్ చేయలేకపోయాడు. ఇంకా అలాగే ఓవరాల్ గా త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రోజు 223 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా ఒక భారీ రికార్డ్ ను క్రియేట్ చేసింది…