Credit Cards: క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకు పెరిపోతుంది. ఒకప్పుడు పెద్ద వ్యాపారాలు చేసే వారి వద్దే క్రెడిట్ కార్డులు కనిపించేవి. కానీ ఇప్పుడు చిరుద్యోగి వద్ద కూడా ఇవి ఉంటున్నాయి. మాన్యువల్ గా షాపింగ్ చేయడానికి, ఆన్ లైన్లో వస్తువులు కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డుల ద్వారా పర్చేజ్ చేయడం వల్ల రివార్డ్ పాయింట్లు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉంటున్నారు. అయితే జూలై 15 నుంచి క్రెడిట్ కార్డుల నిబంధనల్లో మార్పులు వచ్చాయి. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డుల రూల్స్ ను సవరించాయి. ఇవి వినియోగదారులపై ఎఫెక్ట్ పడనున్నాయి. అవేంటంటే?
క్రెడిట్ కార్డుల వినియోగం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి. అయితే దీనిని జాగ్రత్తగా వాడుకోవడం వల్ల లాభాలు ఉంటాయి. క్రెడిట్ కార్డును విచ్చల విడిగా కాకుండా అవసరమైనంత మేరకు మాత్రమే వినియోగించడం మంచిది. లేకుండా అదనంగా ట్యాక్స్ లు, ఫెనాల్టీలు పడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డుల వినియోగంపై వార్షిక ఫీజులు వసూలు చేయడం లేదు. అయితే ఏడాది దాటిన తరువాత చిన్న మొత్తంలో ఛార్జీలు విధిస్తున్నాయి. వీటితో పాటు రివార్డుల విషయంలో, లావాదేవీలపై కొన్ని బ్యాంకులు లేటేస్టుగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.
జూలై నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్డుపై కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ప్రభుత్వ లావాదేవీలు జరిపితే ఎలాంటి రివార్డు పాయింట్స్ రావు. అంతకుముందు వచ్చేవి. జూలై 15 నుంచి ఈ నిబంధనల్లో మార్పులు ఉంటాయి. సిటీ బ్యాంకు కు చెందిన క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు వచ్చాయి. జూలై 15 నాటికి అన్ని మైగ్రేషన్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని వినియోగదారులను కోరింది. ఈవిషయాన్ని మెయిల్ ద్వారా పేర్కొంది.
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ICICI క్రెడిట్ కార్డుకు సంబంధించి కొత్త రూల్స్ ఉంటాయి. అయితే ఇవి జూలై 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ క్రెడిట్ కార్డు ఉన్నవారు రీప్లేస్ మెంట్ కు ఇప్పటి వరకు రూ.100 మాత్రమే చెల్లించేవారు. ఇక నుంచి రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డు ద్వారా చెక్కు, నగదు పికప్ వంటి సేవలు నిలిచిపోనున్నాయి. చార్జ్ స్లిప్ రిక్వెస్ట్ పై రూ.100 చార్జిలు కూడా ఆగిపోనున్నాయి. మరో ప్రైవేట్ బ్యాంకు HDFC క్రెడిట్ కార్డు ఉన్న వారు ఇకపై క్రెడ్, పేటీఎం, చెక్, మొబిక్విక్ మనీ యాప్ లను వినియోగించడం కుదరదు. ఈ నిబంధనలు ఆగస్టు 1 నుంచి వర్తిస్తాయి.