HBD Prabhas: టాలీవుడ్ లో ప్రభాస్ బ్రేకప్ లవ్ స్టోరీస్ ఇన్ని ఉన్నాయా..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

నాలుగు పదుల వయస్సు దాటినా కూడా ఇంకా ఆయన పెళ్లి చేసుకోలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉన్నాయి. అయితే రీసెంట్ గానే ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి గారు అతి త్వరలోనే ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన శుభవార్తని తెలియచేయబోతున్నాము అంటూ మీడియా కి చెప్పుకొచ్చింది.

Written By: Vicky, Updated On : October 23, 2024 1:56 pm

HBD Prabhas(2)

Follow us on

HBD Prabhas: నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘రెబల్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘సలార్’, ‘ఈశ్వర్’ వంటి చిత్రాలను రీ రిలీజ్ చేసారు. వీటికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరోపక్క నేడు ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఇలా నేడు అభిమానులకు గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తున్నాడు ప్రభాస్. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇండియా లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా ప్రభాస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

నాలుగు పదుల వయస్సు దాటినా కూడా ఇంకా ఆయన పెళ్లి చేసుకోలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉన్నాయి. అయితే రీసెంట్ గానే ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి గారు అతి త్వరలోనే ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన శుభవార్తని తెలియచేయబోతున్నాము అంటూ మీడియా కి చెప్పుకొచ్చింది. అయితే ప్రభాస్ కి టాలీవుడ్ లో చాలా బ్రేకప్ లవ్ స్టోరీస్ ఉన్నాయని. వాటి వల్ల ఆయనకీ ప్రేమ పెళ్లి మీద విరక్తి కలిగి ఇన్ని రోజులు పెళ్ళికి దూరంగా ఉంటూ వస్తున్నాడని ఇలా సోషల్ మీడియా లో పలు రకాల వార్తలు చాలా కాలం నుండి ప్రచారం లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఆరోజుల్లో ఘాడంగా ప్రేమించుకున్నారని, ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విడిపోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన వార్త. కాజల్ అగర్వాల్ తో కలిసి ఆయన ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు. డార్లింగ్ మూవీ షూటింగ్ ఫారిన్ లో చేస్తున్న సమయంలోనే వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారట. అప్పట్లో ఒక ఫంక్షన్ లో ప్రభాస్ ని అల్లు అర్జున్ ఈ విషయం లో ఆట పట్టించిన సంగతి తెలిసిందే.

అయితే బ్రేకప్ తర్వాత ప్రభాస్, కాజల్ అగర్వాల్ మధ్య మాటలు లేవని, అందుకే ప్రతీ హీరో పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియచేసే కాజల్ అగర్వాల్, ప్రభాస్ కి మాత్రం చేయదని అందరూ అంటుంటారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్, అనుష్క మధ్య కూడా ప్రేమాయణం నడిచిందని మిర్చి సినిమా షూటింగ్ సమయం నుండి ఒక టాక్ ఉంది. ప్రభాస్ ఇంట్లో జరిగే ప్రతీ శుభకార్యం లో అనుష్క శెట్టి కూడా కనిపించడం వల్ల ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. కానీ వాళ్ళ మధ్య అలాంటిదేమి లేదని, కేవలం స్నేహితులు మాత్రమే అని, ఇప్పటికీ వాళ్లిద్దరూ అంతే క్లోజ్ గా ఉంటారని ప్రభాస్ సన్నిహితులు చెప్పుకొచ్చారు. అలాగే ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో కూడా ప్రేమాయణం నడిపినట్టు టాక్ వచ్చింది. పెళ్లి కాకుంటే ఇలాంటి వార్తలే తరచూ వినాల్సి వస్తుంది, కాబట్టి త్వరగా పెళ్లి చేసుకో అన్నా అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.